Share News

Delhi High Court: ఏపీ భవన్‌లో కూల్చివేతలపై ఢిల్లీ హైకోర్టు స్టే

ABN , Publish Date - May 16 , 2025 | 03:32 AM

న్యూఢిల్లీలోని ఏపీ భవన్ పరిసరాల్లోని 1970లో నిర్మించిన శ్రీ శివ వేంకటేశ్వర ఆలయాన్ని కూల్చివేయడానికి జరిగిన ప్రయత్నంపై ఢిల్లీ హైకోర్టు ఈనెల 19 వరకు స్టే విధించింది.

 Delhi High Court: ఏపీ భవన్‌లో కూల్చివేతలపై ఢిల్లీ హైకోర్టు స్టే

న్యూఢిల్లీ, మే 15(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కూల్చివేతలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈనెల 19 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ పరిసరాల్లోని శ్రీ శివ వేంకటేశ్వర మందిరాన్ని కూల్చివేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆలయ అర్చకుడు గోపాల్‌ కుమార్‌ మిశ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 1970లో నిర్మించిన ఆలయాన్ని కూల్చివేయాలని ఏపీ భవన్‌ అధికారులు ప్రయత్నిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ జస్టిస్‌ సచిన్‌ దత్తా ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, ఈనెల 19 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Updated Date - May 16 , 2025 | 03:33 AM