Share News

Cyber Fraud Kurnool: వృద్ధురాలి ఖాతాలో 2.15 లక్షలు మాయం

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:59 AM

తన బ్యాంకు ఖాతాలోని రూ.2.15 లక్షలు మాయమైనట్లు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్లుకు..

Cyber Fraud Kurnool: వృద్ధురాలి ఖాతాలో 2.15 లక్షలు మాయం
Cyber Fraud Kurnool

  • విడతల వారీగా కొట్టేసిన సైబర్‌ మోసగాళ్లు!

  • మీ సేవలో చలానా తీసి.. ఫిర్యాదు చేయాలన్న సైబర్‌ క్రైం

దేవనకొండ, జూలై 17(ఆంధ్రజ్యోతి): తన బ్యాంకు ఖాతాలోని రూ.2.15 లక్షలు మాయమైనట్లు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్లుకు చెందిన శాలు బీ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. శాలు బీ అనే వృద్ధురాలికి గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఆ ఖాతాకు ఆమె కుమారుడు మాబుసుభాన్‌ ఫోన్‌ నంబరు లింక్‌ చేశారు. గత నెలలో ఎల్‌ఐసీ డబ్బులు 59 వేలు, పొదుపు సంఘం రుణం 1.50 లక్షలు ఆమె ఖాతాకు జమయ్యాయి. ఈ నెల 7న ఆమె కుమారుడి సెల్‌ నంబరు బ్లాక్‌ అయింది. 8వ తేదీన ఆమె ఖాతా నుంచి రూ.49 వేల చొప్పు రెండు సార్లు, 9వ తేదీన రూ.49 వేల చొప్పున రెండు సార్లు డబ్బులు కట్‌ అయ్యాయి. ఆతర్వాత పలు విడతల్లో మిగతా నగదు కట్‌ అయింది. మాబుసుభాన్‌ కొత్త సిమ్‌ తీసుకోవడానికి ప్రయత్నించగా సైబర్‌ మోసగాళ్లు ఆధార్‌ నంబరును లాక్‌ చేశారు. 14వ తేదీన అదే నంబర్‌పై కొత్త సిమ్‌ తీసుకున్నారు. బ్యాంకు ఖాతాలో నగదు కట్‌ అయినట్లు 15వ తేదీ నుంచి మేసేజ్‌లు వచ్చాయి. దీంతో బాధితురాలు కర్నూలు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించగా మీసేవలో చలానా చెల్లించి దేవనకొండ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపారు. మీ సేవలో సర్వర్‌ సమస్య ఉందని, శుక్రవారం చలానా చెల్లిస్తామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 05:59 AM