Share News

Heavy Rainfall: ఉత్తరకోస్తాలో వర్షం.. సీమలో భగభగ

ABN , Publish Date - May 15 , 2025 | 04:26 AM

ఉత్తరకోస్తాలో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఏలూరు ప్రాంతంలో భారీ వర్షం కురిసి మామిడి పంటలకు నష్టం జరిగిందని సమాచారం. మర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎగిసి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rainfall: ఉత్తరకోస్తాలో వర్షం.. సీమలో భగభగ

మరో రెండు రోజులు భిన్న వాతావరణం

నేడు ఉత్తరకోస్తా, రేపు సీమలో భారీ వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, ఏలూరుసిటీ, మే 14 (ఆంధ్రజ్యోతి): వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో ఉత్తరకోస్తాలో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మామిడి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లాలోనూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా కుండపోతగా వర్షం కురిసింది. ఏలూరులోనూ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏలూరు అర్బన్‌ ప్రాంతంలో 79.4, ఏలూరు రూరల్‌ మండలంలో 55.4, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం జగ్గిలబొంతులో 53.25, శ్రీకాకుళం మండలం రాగోలులో 49.25, శ్రీకాకుళం నగరంలో 47.27, ఏలూరు జిల్లా పూళ్లలో 44.5, ఏలూరులో 34.5, మన్యం జిల్లా పాలకొండలో 32.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రకాశం జిల్లా పొనుగోడు, కొనకనమిట్ల, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8, పల్నాడు జిల్లా కాకానిలో 42.7, బాపట్ల జిల్లా కొమ్మాలపాడులో 42, నెల్లూరు జిల్లా దగదర్తిలో 41.7, నంద్యాల జిల్లా బొల్లవరంలో 41.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు భిన్నమైన వాతావరణం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 35 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:27 AM