Share News

CS Vijay Anand: రోజంతా కరెంటు ఇవ్వాల్సిందే

ABN , Publish Date - May 07 , 2025 | 06:45 AM

వేసవి కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా రోజంతా కరెంటు ఇవ్వాలని ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ ఆదేశించారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలతో సమీక్ష నిర్వహించిన ఆయన, పునరుద్పాదక ఇంధన వనరులు, ఇతర రాష్ట్రాలతో పవర్‌ స్వాపింగ్‌పై దృష్టి సారించారు

CS Vijay Anand: రోజంతా కరెంటు ఇవ్వాల్సిందే

విద్యుత్‌ సంస్థలకు సీఎస్‌ విజయానంద్‌ ఆదేశం

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా రోజంతా కరెంటు సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశించారు. మంగళవారం ఏపీ జెన్కో ఎండీ కేవిఎన్‌ చక్రధరబాబు, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ఏకేవీ భాస్కర్‌ ఇతర అధికారులతో విజయానంద్‌ సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఏపీజెన్కోకు చెందిన ధర్మల్‌, హైడల్‌ కేంద్రాలతో సహా.. సౌర, పవన, కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలు, హెచ్‌పీసీఎల్‌ వంటి పునరుద్పాదక ఇంధన వనరులు, ఇతర రాష్ట్రాలతో పవర్‌ స్వాపింగ్‌, విద్యుత్‌ ఎక్స్‌చేంజ్‌ల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర డిస్కమ్‌లు ప్రత్యేకంగా.. ఉదయం, సాయంత్రం పీక్‌ సమయాల్లో పవర్‌ స్వాపింగ్‌ ద్వారా డిమాండ్‌ను తట్టుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏప్రిల్‌ 30 నుంచి మే 4వ తేదీ వరకూ డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ను సరఫరా చేయగలిగామని విజయానంద్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - May 07 , 2025 | 06:45 AM