TDP Alliance: నాడు వైసీపీ నేడు కూటమి
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:40 AM
వైసీపీ గతంలో ఎలా పరిపాలన సాగించిందో టీడీపీ కూటమి కూడా అలాగే పరిపాలన సాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
రెండింటి తీరూ ఒక్కటే: రామకృష్ణ
అనంతపురం విద్య, జూన్ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ గతంలో ఎలా పరిపాలన సాగించిందో టీడీపీ కూటమి కూడా అలాగే పరిపాలన సాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వ్యక్తిగత, రాజకీయ కక్షలతో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురంలో సోమవారం నిర్వహించిన పార్టీ నగర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు కొనసాగుతోందని గొప్పలు చెబుతున్నా అభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన నిధులు లేవంటూ కొత్త అప్పులు తీసుకొస్తున్నారని విమర్శించారు. ‘రప్పా రప్పా నరుకుతాం అనడం సంతోషమే’ అంటూ మాజీ సీఎం జగన్ సమర్థించడం అవివేకమన్నారు. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్త చనిపోయారని, సంతాపం తెలపాల్సిన బాధ్యత వైసీపీ నేతలపై ఉందన్నారు.