Share News

Jagan Mohan Reddy: అయోమయం... జగన్‌ నాదం!

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:08 AM

అడ్డగోలు సమర్థనలు... అడ్డదిడ్డ వాదనలు! గుట్టలుగా నోట్లకట్టలతో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనుచరుడు వెంకటేశ్‌ నాయుడును వెనకేసుకొచ్చేందుకు జగన్‌

Jagan Mohan Reddy: అయోమయం... జగన్‌ నాదం!
Jagan Mohan Reddy

వెంకటేశ్‌ నాయుడిపై అర్థంలే

  • జగన్‌ రోత పత్రికలో విచిత్ర కథనాలు

  • చెవిరెడ్డికి సన్నిహితుడంటూనే.. కూటమి నేతలతో దిగిన ఫొటోల ప్రచురణ

  • ‘చెల్లని నోట్లు’ అంటూ 2 వేలపై కట్టు కథలు

  • జనం వద్దే రూ.6 వేల కోట్లున్నాయని ఒక కథనం

  • తాడేపల్లి ప్యాలె్‌సలోకి వెంకటేశ్‌కు డైరెక్ట్‌ ఎంట్రీ

  • జగన్‌తో పలుమార్లు కరచాలనం, భేటీలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): అడ్డగోలు సమర్థనలు... అడ్డదిడ్డ వాదనలు! గుట్టలుగా నోట్లకట్టలతో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అనుచరుడు వెంకటేశ్‌ నాయుడును వెనకేసుకొచ్చేందుకు జగన్‌ రోత పత్రిక నానా తంటాలు పడుతోంది. అసలు ఆయన తమ పార్టీకి చెందిన వ్యక్తా... లేక, కూటమి పార్టీలకు మద్దతుదారా? కనీసం ఈ విషయంపైనా స్పష్టత ఇవ్వలేక తన పాఠకులనూ గందరగోళంలోకి నెడుతోంది. అభద్రతా భావంతో అర్థంలేని వాదనలను తెరపైకి తెస్తోంది. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని, వెంకటేశ్‌ నాయుడును బెంగళూరు విమానాశ్రయంలో ఒకే రోజు, ఒకే సమయంలో, ఇద్దరినీ కలిపి ‘సిట్‌’ అధికారులు అరెస్టు చేశారు. ఆయన చెవిరెడ్డికి సన్నిహితుడనేది నిర్వివాదాంశం. ఆదివారం సంచికలో జగన్‌ రోత పత్రిక పరోక్షంగా ఈ విషయాన్ని అంగీకరించింది కూడా. పట్టుబడిన డబ్బులు మద్యం స్కామ్‌కు సంబంధించినవి కావని... వెంకటేశ్‌ నాయుడికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉందని వెనకేసుకొచ్చింది. ఒక్కరోజు తిరగ్గానే... సోమవారం సంచికలో వెంకటేశ్‌ నాయుడు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని తదితరులతో దిగిన ఫొటో ప్రచురించి... అతను టీడీపీ మద్దతుదారుడన్నట్టుగా ‘కవరేజీ’ ఇచ్చింది. నిజానికి... పలు సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీల నాయకులతో వెంకటేశ్‌ నాయుడు ఫొటోలు దిగారు. టీడీపీ, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలతోనూ ఫొటోలు దిగారు. ‘మరి... దొరికిపోయిన డబ్బులు వాళ్లందరివీ కూడా అని అనుకోవచ్చు కదా!’ అనే అతితెలివి లాజిక్కును లేవనెత్తింది. వెంకటేశ్‌ నాయుడు వేర్వేరు సందర్భాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతల పక్కన నిలబడి ఫొటోలు దిగడం నిజమే. కానీ... చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వంటి నేతలతో ‘తాడేపల్లి ప్యాలె్‌స’లోకి వెంకటేశ్‌ నాయుడు డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చారు. జగన్‌ను అనేకపర్యాయాలు కలిశారు. ఇద్దరూ ఆత్మీయ కరచాలనాలు చేసుకున్న చిత్రాలు అనేకం బయటికి వచ్చాయి. తాడేపల్లి ప్యాలె్‌సలోకి ‘ఎంట్రీ’ అంత ఈజీ కాదని... ఎవరు పడితే వారు లోపలికి వెళ్లి, జగన్‌ను కలిసే అవకాశం రాదని వైసీపీ నేతలకు బాగా తెలుసు. అంతెందుకు... ‘చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడుపై సిట్‌ సమర్పించిన రిమాండ్‌ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి’’ అని జగన్‌ పత్రిక ఒక కథనంలో పేర్కొంది. ‘అతను మా వాడే’ అని ధ్రువీకరించింది.


రూ.2వేల నోట్ల కథ...

వెంకటేశ్‌ నాయుడు గుట్టలుగా ఉన్న నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోగా... అందులో ఒకే ఒక్క 2వేల రూపాయల నోట్ల కట్టలు కొన్ని బయటపడ్డాయి. వీటి విలువ రూ.6లక్షల నుంచి 8 లక్షలు ఉండొచ్చు. మిగిలినవన్నీ రూ.500 నోట్ల కట్టలే! కానీ... ‘చెల్లని నోట్లతో కట్టు కథ’ అంటూ రోతపత్రిక వింత వాదన మొదలుపెట్టింది. ‘దేశంలో 2వేల రూపాయల నోట్ల చలామణీ పూర్తిగా ఆగిపోయిందని 2023 మే 19న ఆర్బీఐ చివరి సారిగా ప్రకటించింది’ అని కూడా సోమవారం నాటి సంచికలో రోత పత్రిక వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే... 2వేల నోటు చెల్లని నోటు కాదు! చెలామణిలో లేని లేటు మాత్రమే! ఆ నోట్లను బహిరంగ మార్కెట్లో మార్చుకోలేరు కానీ... ఆర్బీఐ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇప్పటికీ వాటిని మార్చుకోవచ్చు. ఇక... ‘ఆర్బీఐ చివరిసారిగా ప్రకటించింది’ అనే విషయానికి వద్దాం! ఆగస్టు 2వ తేదీన, అంటే శనివారంనాటి సంచికలో జగన్‌ పత్రికలోనే ఒక వార్త ప్రచురించింది. దీని ప్రకారం ‘‘దేశంలో ఇంకా రూ.6,017 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు జనంవద్దే ఉన్నాయి. అవి ఆర్బీఐకి తిరిగి రాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద ఇప్పటికీ రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చు’’! ఇది అక్షరాలా నిజం! ‘2వేల నోట్లు చెల్లవని 2023 మే 19న ఆర్బీఐ చివరిసారిగా ప్రకటించింది’ అని సోమవారం సంచికలో జగన్‌ పత్రిక రాసిన విషయం పచ్చి అబద్ధం. జనంవద్దే ఉన్న రూ.6017 కోట్ల రూ.2వేల నోట్లలో ‘లిక్కర్‌ గ్యాంగ్‌’ వద్ద ఎన్ని ఉన్నాయో తెలియదు! రకరకాల మార్గాల్లో లిక్కర్‌ సొమ్మును మార్చుకున్న ఈ ముఠా వద్ద 2వేల నోట్లు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది?

అలా వదిలేస్తారా...

నిజంగానే వెంకటేశ్‌ నాయుడుకు టీడీపీ నేతలతో సంబంధాలుంటే... ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీకి చెందినవారివైతే... అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఊరికే వదిలేస్తుందా? జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో .. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక విమానాల్లో వెంకటేశ్‌ నాయుడు తిరగగలరా? జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిపైనా నిఘా పెట్టారు. వెంకటేశ్‌ నాయుడు గుట్టలుగా నోట్ల కట్టలు తరలిస్తుంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం వదిలేసే అవకాశమే లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 07:19 AM