Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై మార్ఫింగ్ పోస్టులు.. ఫిర్యాదు
ABN , Publish Date - Jun 23 , 2025 | 06:40 AM
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు.
పిఠాపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నేతలు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ర్యాండమ్ ఫారె్‌స్టతో పాటు పలు సామాజిక మాధ్యమ ఖాతాల్లో పవన్‌కల్యాణ్ స్థానంలో మార్ఫింగ్ చేసి కుక్క ఫొటో పెట్టారని, వైజాగ్‌లో యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్న ఉప ముఖ్యమంత్రి అంటూ అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారని నాయకులు వివరించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అవహేళన చేస్తున్నట్టుగా ఈ పోస్టులు ఉన్నాయన్నారు. ఈ మేరకు పిఠాపురానికి చెందిన జనసేన నేతలు చెల్లుబోయిన సతీశ్‌కుమార్, దానం లాజర్‌బాబు తదితరులు ఫిర్యాదు చేశారు.