Share News

CCTV Cameras: సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి ఆలయాలు

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:33 AM

ఈ మేరకు బుధవారం ఆయన ఒక సర్క్యూలర్‌ జారీ చేశారు. ఆలయాల భద్రత దృష్ట్యా ఆర్జేసీ, డీసీ కేడర్‌ ఆలయ ప్రాంగణాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలన్నారు.

CCTV Cameras: సీసీ కెమెరాల  పర్యవేక్షణలోకి ఆలయాలు

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక సర్క్యూలర్‌ జారీ చేశారు. ఆలయాల భద్రత దృష్ట్యా ఆర్జేసీ, డీసీ కేడర్‌ ఆలయ ప్రాంగణాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలన్నారు. చెప్పుల స్టాంట్‌, క్లాక్‌ రూమ్స్‌, సెల్‌ఫోన్‌ కౌంటర్స్‌, రూమ్‌ బుకింగ్‌ కౌంటర్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని నిర్దేశించారు. ఆలయంలో రెగ్యులర్‌ ఉద్యోగికి సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని సృష్టం చేశారు. ఆర్జేసీ, డీసీ కేడర్‌ ఆలయాల్లో వర్షపు నీటి నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 05:33 AM