Coastal Andhra: జైళ్ల డీఐజీ జులుం!
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:05 AM
ఇప్పటికే అనేక వివాదాల్లో ఇరుకున్న డీఐజీ.. తాజాగా తన పరిధిలోని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్లు, జిల్లా జైళ్ల అధికారులకు శుక్రవారం ఓ మెమో జారీ చేశారు. జైళ్లలో అసాధారణ, అవాంఛనీయ సంఘటనలు ఏం జరిగినా ముందుగా తన దృష్టికి తీసుకురావాలని, లేకపోతే కనికరం లేకుండా చర్యలు తీసుకుంటానని అందులో బెదిరించారు.

అధికారులు, సిబ్బందిపై బెదిరింపుల పర్వం
ఏం జరిగినా.. ముందు నాకే చెప్పాలి
మీడియాకు సమాచారం చేరవేస్తే కఠిన చర్యలు
కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ మెమో
21న జీవిత ఖైదీతో ఇంట్లో ఏసీకి మరమ్మతు
బ్యారక్‌లోనే ఉన్నట్లు చూపించిన అధికారులు
రాజమహేంద్రవరం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ వైఖరి వివాదాస్పదంగా మారింది. ఆయన తీరుతో ఖైదీలతో పాటు అధికారులు, ఉద్యోగులు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే అనేక వివాదాల్లో ఇరుకున్న డీఐజీ.. తాజాగా తన పరిధిలోని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్లు, జిల్లా జైళ్ల అధికారులకు శుక్రవారం ఓ మెమో జారీ చేశారు. జైళ్లలో అసాధారణ, అవాంఛనీయ సంఘటనలు ఏం జరిగినా ముందుగా తన దృష్టికి తీసుకురావాలని, లేకపోతే కనికరం లేకుండా చర్యలు తీసుకుంటానని అందులో బెదిరించారు. తనకు తెలియకుండా పేపర్లలోనూ, ఎలక్ర్టానిక్ మీడియాలో పలు ఘటనలు ప్రచారం కావడం వల్ల తాను ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగుల్లో మరింత ఆందోళన మొదలైంది. ఇదిలాఉండగా, రాజమండ్రి సెంట్రల్ జైలు గోదావరి బ్యారక్‌లోని లాక్‌పలో ఉండాల్సిన షడ్రక్ అనే ఖైదీతో ఈ నెల 21న డీఐజీ తన ఇంట్లో ఏసీ మరమ్మతు చేయించుకున్నారు.
అయితే అదే సమయంలో సదరు ఖైదీ బ్యారక్‌లోనే ఉన్నట్టు అధికారులు చూపించడం గమనార్హం. ఆ రోజు రాత్రి 8.30 గంటలకు సెంట్రల్ జైలు మెయిన్ గేటు నుంచి షడ్రక్ బయటకు వెళుతున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డయింది. దీనికి సంబంఽధించిన వీడియో బయటకు రావడంతో డీఐజీ తాజా ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. కొద్ది నెలల కిందట సుభానీ అనే ఖైదీతో తన ఇంట్లో పని చేయించుకోవడంతో పాటు, అతడిని చితకబాదిన విషయం బయటకు వచ్చింది. అప్పట్లో జైలు అధికారులు, డాక్టర్లతో పాటు దెబ్బలు తిన్న ఖైదీని కూడా భయపెట్టి తప్పుడు రిపోర్టు వచ్చేలా చేసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన వైఖరి వివాదాస్పదమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..
Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..
Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట
Read Latest AP News and Telugu News