CM Chandrababu: సాయి స్ఫూర్తిని, బోధనలను ప్రపంచమంతా పరిచయం చేయాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 22 , 2025 | 07:36 PM
శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా శాఖ మంత్రి లోకేష్ సహ వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు
విలువల ఆధారంగా, వ్యక్తిత్వ నిర్మాణమే కేంద్రంగా ఉన్న శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవానికి హాజరైనందుకు గౌరవంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టభద్రులవుతున్న గ్రాడ్యుయేట్లందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా శాఖ మంత్రి లోకేష్ సహ వివిధ మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు (Chandrababu in Puttaparthi).
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'భగవాన్ బాబా విశిష్టమైన విద్యా విధానానికి ఇక్కడున్న విద్యార్థులంతా ప్రతిరూపాలు. ఈ విద్యా విధానం విద్యార్థులను వృత్తిపరంగా సమర్థులుగా, సామాజిక బాధ్యత కలిగినవారిగా, ఆధ్యాత్మిక స్పృహ కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సత్యసాయి ఒక ఉద్దేశ్యంతో ఈ లోకానికి వచ్చారు. ఒక ఉద్దేశ్యం కోసమే జీవించారు. మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారు' అని సీఎం అన్నారు (CM Naidu Puttaparthi visit).

'ఇప్పుడు పట్టభధ్రులు అయిన వారంతా నిస్వార్థ సేవ, కరుణ నిజాయితీ అనే విలువలను ఆచరించాలి. భారతదేశం వేల సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది. 1990ల మధ్యలో సాంకేతిక పురోగతి ప్రారంభమైంది. ఇది హైదరాబాద్‌తో సహా అనేక నగరాలను ప్రపంచ ఐటీ హబ్‌లుగా మార్చింది. 2047 నాటికి మనం ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా అవతరిస్తాం' అని సీఎం పేర్కొన్నారు (Chandrababu Prasanthi Nilayam).

'ఈ రోజు భారతదేశానికి అధిక జనాభా వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇది మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం మనకు ఉంది. ఈ అనుకూలతలన్నీ సద్వినియోగం చేసుకుని మన దేశం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగింది. భారత దేశంలో తెలుగు వాళ్లు నెంబర్-1గా ఉండేలా పని చేస్తున్నాం. విద్యార్థులు, యువత దేశానికి సంరక్షకులు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా, విలువలతో ముందుకు వెళ్లాలి' అని పిలుపునిచ్చారు (AP CM spiritual visit).

'సాయి సిద్ధాంతాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలి. సాయి బాబా స్పూర్తితో వెల్తీ, హెల్తీ, హ్యపీ సొసైటీని రూపొందించడానికి కృషి చేయాలి. కోయంబత్తూరు గాంధీగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు పేరుంది. నిత్యం ప్రజలకు సేవ చేయాలని తపన పడుతూ ఉంటారు. ప్రస్తుతం సత్యసాయి జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో సహా రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారంతా వచ్చారు. సత్యసాయి బాబా గొప్పదనం ఇది. పుట్టపర్తి అనేది సత్యసాయి బాబా ప్రవిత్ర భూమి' అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీకి వర్ష సూచన.. వారం రోజుల్లో
పరకామణి చోరీ కేసు.. జర్నలిస్టు భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు