CM Chandrababu : బనకచర్లతో ఎవరికీ నష్టం లేదు
ABN , Publish Date - Mar 05 , 2025 | 06:45 AM
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని, సముద్రంలోకి వెళ్లే నీటినే కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘

గోదావరి వృథా నీటినే తరలిస్తున్నాం: చంద్రబాబు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని, సముద్రంలోకి వెళ్లే నీటినే కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘తెలంగాణలో ఉండేవారితోపాటు తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరి జలాలను బనకచర్లకు తీసుకెళ్లడం వల్ల ఎవరికీ నష్టం జరగదు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటినే తరలిస్తున్నాం. దీనిని కూడా ఓ పార్టీ రాజకీయం చేస్తోంది. ఒకరు మాట్లాడితే తాము వెనుకబడి పోతామని మరికొందరు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఏనాడూ వ్యతిరేకించలేదు. గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి. తెలంగాణలోని కరువు ప్రాంతాలకు కూడా గోదావరి నీటిని తరలించుకోవచ్చు. నదుల అనుసంధానం జరిగితే సముద్రంలోకి వెళ్లే వృథాజలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు.