Medical Dept: సీఎం మాటిచ్చారు.. సాయం అందింది
ABN , Publish Date - May 19 , 2025 | 04:56 AM
కర్నూలులో అప్లాస్టిక్ అనీమియా తో బాధపడుతున్న తగరం గోపాల్ కుటుంబానికి సీఎం చంద్రబాబు వైద్యం కోసం సాయం హామీ ఇచ్చారు. 24 గంటలలో రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా అందజేయబడింది.
కర్నూలు, మే 18(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ నెల17న కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నేలతలమారి గ్రామానికి చెందిన తగరం గోపాల్ (60) వైద్యం కోసం సాయం చేయాలని కోరుతూ ఆయన భార్య సువర్ణమ్మ సీఎంను కోరారు. గోపాల్ ప్రాణాంతకమైన ‘అప్లాస్టిక్ అనీమియా’ వ్యాధితో బాధపడుతున్నారని, శస్త్రచికిత్సకు రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని విన్నవించారు. దీనిపై చంద్రబాబు స్పందించి అభయమిచ్చారు. ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే సీఎం హామీ మేరకు రూ.5 లక్షల చెక్కును బాధితుడి బంధువు దినకర్‌కు కలెక్టరు పి.రంజిత్‌బాషా ఆదివారం అందజేశారు.