Share News

TDP Office Attack: నేడు గుంటూరు సీఐడీ ఆఫీసుకు సజ్జల, దేవినేని

ABN , Publish Date - May 09 , 2025 | 05:58 AM

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్‌ కు సీఐడీ పిలుపు ఇచ్చింది. ఈ దాడికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు

TDP Office Attack: నేడు గుంటూరు సీఐడీ ఆఫీసుకు సజ్జల, దేవినేని

  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎట్టకేలకు కదలిక

గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఆ కేసు నిందితుల్లో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకుడు దేవినేని అవినాశ్‌కు సీఐడీ నుంచి పిలుపు వచ్చింది. ఆ దాడిలో వీరిద్దరూ తెరవెనుక కీలక పాత్ర పోషించారనేందుకు తగు ఆధారాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో అరెస్టయిన, విచారణకు హాజరైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సజ్జలను ఏ-120గా చేర్చారు. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. సమాచారం ఇచ్చినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు.


వైసీపీ శ్రేణులకు విధ్వంసం సృష్టించాయి. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై తూతూమంత్రంగా కేసు నమోదుచేసి పక్కనపడేసిన పోలీసులు.. టీడీపీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక దీని దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. జగన్‌ ప్రభుత్వం ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని సీఐడీ ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సూత్రదారి సజ్జలేనని తేల్చారు. ఇందుకు సంబందించిన సమగ్ర వివరాలు రాబట్టేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆయనకు, దేవినేని అవినాశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా వస్తున్నామని సమాచారం ఇచ్చారు.

Updated Date - May 09 , 2025 | 05:58 AM