Share News

‘కూటమి’ ప్రభుత్వానికి సంక్షేమమే ముఖ్యం

ABN , Publish Date - Feb 03 , 2025 | 02:11 AM

కూటమి ప్రభుత్వానికి పగకంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అందుకే ఎనిమిది నెలల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారన్నారు. సోమలలో ఆదివారం జరిగిన ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు కేవలం రూ.250 పింఛను పెంచడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. అదే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛనును రూ.4వేలకు, దివ్యాంగులకు రెట్టింపు పెంచిందని గుర్తుచేశారు. 64 లక్షల మందికి రూ.20537 కోట్లను ఒకటో తేదీనే ఇస్తూ దేశంలోనే రికార్డు సాధించిందని చెప్పారు.

‘కూటమి’ ప్రభుత్వానికి సంక్షేమమే ముఖ్యం
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న నాగబాబు

ఫ పుంగనూరులో మార్మోగుతున్న పెద్దిరెడ్డి దౌర్జన్యాలు, దోపిడీలు

ఫ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు

సోమల/పుంగనూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వానికి పగకంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అందుకే ఎనిమిది నెలల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ప్రధాని నరేంద్రమోదీ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారన్నారు. సోమలలో ఆదివారం జరిగిన ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు కేవలం రూ.250 పింఛను పెంచడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. అదే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛనును రూ.4వేలకు, దివ్యాంగులకు రెట్టింపు పెంచిందని గుర్తుచేశారు. 64 లక్షల మందికి రూ.20537 కోట్లను ఒకటో తేదీనే ఇస్తూ దేశంలోనే రికార్డు సాధించిందని చెప్పారు. అమరావతి, పోలవరానికి నిధులు, 80 లక్షల మందికి దీపం, వంటగ్యాస్‌, రూ.361కోట్లు రోడ్ల రిపేరుకు, 16,347 మంది ఉపాధ్యాయులకు మెగా డీఎస్సీ, 6100 మంది పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు.. చెత్తపన్ను రద్దు చేసిందని, ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వడంతోపాటూ 20 ప్రముఖ కంపెనీలు, రాష్ట్రంలో రూ.6.33 లక్షల కోట్లు ఖర్చు చేసి 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్‌కు 52 ఎకరాల స్థల సేకరణ, ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణకు రూ.11440 కోట్ల కేటాయింపు, విశాఖ సీసీఎ్‌సలో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు, 119 అన్నా క్యాంటీన్ల ప్రారంభం తదితర అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే అరాచకానికి మారు పేరని విమర్శించారు. ఆయన దౌర్జన్యాలు, దోపిడీలు పుంగనూరు నియోజకవర్గంలో మార్మోగుతున్నాయని నాగబాబు మండిపడ్డారు. అందువల్లే ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన నియోజకవర్గంలోకి ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో టిడ్కో చైర్మన్‌ అజయ్‌కుమార్‌, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకులు హరిప్రసాద్‌, కిరణ్‌రాయల్‌, వేణుగోపాల్‌రెడ్డి, పగడాల రమణ, సుభాషిణి, రాందా్‌సచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 02:12 AM