న్యాయం కావాలంటూ..
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:55 AM
న్యాయ దేవత వేషధారిణికి ఒక చేతిలో భారత రాజ్యాంగం. మరో చేతిలో త్రాసు. అందులో ఒకవైపు వెటర్నేరియన్ల కష్టం, ప్రొఫెషన్ ప్రాముఖ్యత బరువైన బ్లాకులుగా ఉంచారు. మరోవైపు తక్కువ మొత్తంలో స్టైఫండ్‌ని చిన్నపెట్టెలో ఉంచారు. విద్యార్థుల కష్టాల బరువు ఎక్కువగా ఉండటంతో త్రాసు సమతుల్యం కాదని.. న్యాయం ఎటువైపుకి ఒరగాలి.. అంటూ వెటర్నరీ విద్యార్థులు మంగళవారం వినూత్న తరహాలో నిరసన తెలిపారు. వైద్యవిద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలంటూ నెల రోజులుగా వీరు చేపట్టిన నిరవధిక సమ్మె.. మంగళవారమూ కొనసాగింది. వర్సిటీ ప్రధానగేటు వద్ద ఏర్పాటు చేసిన దీక్షాశిబిరంలో విద్యార్థులు బైఠాయించి ప్లకార్డులు చేతపట్టారు. తమ హక్కులకోసం ప్రభుత్వాన్ని, వర్సిటీ అధికారులను వేడుకుంటున్నా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ పి.జగపతిరామయ్య విద్యార్థుల వద్దకు వచ్చి వెంటనే సమ్మెని విరమించి తరగతులకు హాజరుకావాలని, లేకుఉంటే బుధవారం నుంచి హాస్టళ్ల మెస్‌లని మూసివేస్తామన్నారు. ఆ మరుసటిరోజున హాస్టళ్లు ఖాళీచేయాల్సి ఉంటుందని వివరించారు. హాస్టళ్లను మూసినా సమ్మె కొనసాగిస్తామని విద్యార్థులు అంటున్నారు.

తిరుపతిరూరల్, మార్చి4 (ఆంధ్రజ్యోతి): న్యాయ దేవత వేషధారిణికి ఒక చేతిలో భారత రాజ్యాంగం. మరో చేతిలో త్రాసు. అందులో ఒకవైపు వెటర్నేరియన్ల కష్టం, ప్రొఫెషన్ ప్రాముఖ్యత బరువైన బ్లాకులుగా ఉంచారు. మరోవైపు తక్కువ మొత్తంలో స్టైఫండ్‌ని చిన్నపెట్టెలో ఉంచారు. విద్యార్థుల కష్టాల బరువు ఎక్కువగా ఉండటంతో త్రాసు సమతుల్యం కాదని.. న్యాయం ఎటువైపుకి ఒరగాలి.. అంటూ వెటర్నరీ విద్యార్థులు మంగళవారం వినూత్న తరహాలో నిరసన తెలిపారు. వైద్యవిద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలంటూ నెల రోజులుగా వీరు చేపట్టిన నిరవధిక సమ్మె.. మంగళవారమూ కొనసాగింది. వర్సిటీ ప్రధానగేటు వద్ద ఏర్పాటు చేసిన దీక్షాశిబిరంలో విద్యార్థులు బైఠాయించి ప్లకార్డులు చేతపట్టారు. తమ హక్కులకోసం ప్రభుత్వాన్ని, వర్సిటీ అధికారులను వేడుకుంటున్నా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ పి.జగపతిరామయ్య విద్యార్థుల వద్దకు వచ్చి వెంటనే సమ్మెని విరమించి తరగతులకు హాజరుకావాలని, లేకుఉంటే బుధవారం నుంచి హాస్టళ్ల మెస్‌లని మూసివేస్తామన్నారు. ఆ మరుసటిరోజున హాస్టళ్లు ఖాళీచేయాల్సి ఉంటుందని వివరించారు. హాస్టళ్లను మూసినా సమ్మె కొనసాగిస్తామని విద్యార్థులు అంటున్నారు.
నేటినుంచి మెస్ సేవలు నిలిపివేత
నెల రోజులుగా తరగతులను బహిష్కరించి సమ్మెబాటలో ఉన్నందున్న బుధవారం నుంచి హాస్టళ్లకి అనుబంధంగా ఉన్న మెస్‌సేవలను నిలుపుదల చేస్తూ వర్సిటీ అధికారులు నోటీసు జారీ చేశారు. ఈమేరకు విద్యార్థులకు మెస్‌సేవలు ఉండవని, అలాగే గురువారానికి హాస్టళ్లని పూర్తిస్థాయిలో ఖాళీ చేయాల్సిఉందని నోటీసులో పేర్కొన్నారు.