Share News

ఉమ్మడి పీజీ సెట్‌ రద్దు కోసం వర్సిటీలు, కాలేజీల బంద్‌

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:57 AM

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉమ్మడి పీజీసెట్‌ రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌ చేపట్టారు. పీజీ ప్రవేశాలు నిర్వహించుకునే వెసులుబాటు యూనివర్సిటీలకే అప్పగించాలని కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వీరు బంద్‌కు పిలుపునిచ్చారు. యూనివర్సిటీలు, కాలేజీలను విద్యార్థి నేతలు కలియతిరుగుతూ బంద్‌ పర్యవేక్షించారు. ఎస్వీయూనివర్సిటీలో విద్యార్థి సంఘాలన్నీ బంద్‌ సందర్భంగా ర్యాలీ చేపట్టాయి. యూనివర్సిటీలోనే బైఠాయించి నిరసన తెలిపాయి. ఉమ్మడి పీజీసెట్‌ వల్ల రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఇప్పటికే పీజీ ప్రవేశాలు భారీగా తగ్గాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో యూనివర్సిటీలే మూత పడే ప్రమాదం ఉందన్నారు. పీజీ అడ్మిషన్లు యూనివర్సిటీలే నిర్వహించుకునేటప్పుడు యూనివర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అనుసరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు శివారెడ్డి, చలపతి, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు రవి, అక్బర్‌, ఎన్‌ఎ్‌సయూఐ నేత జెన్నే మల్లికార్జున, లా విద్యార్థి సంఘ నేత సుందర్రాజు, బీసీ విద్యార్థి సంఘ నేత తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి పీజీ సెట్‌ రద్దు కోసం   వర్సిటీలు, కాలేజీల బంద్‌
బంద్‌లో పాల్గొన్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉమ్మడి పీజీసెట్‌ రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల బంద్‌ చేపట్టారు. పీజీ ప్రవేశాలు నిర్వహించుకునే వెసులుబాటు యూనివర్సిటీలకే అప్పగించాలని కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వీరు బంద్‌కు పిలుపునిచ్చారు. యూనివర్సిటీలు, కాలేజీలను విద్యార్థి నేతలు కలియతిరుగుతూ బంద్‌ పర్యవేక్షించారు. ఎస్వీయూనివర్సిటీలో విద్యార్థి సంఘాలన్నీ బంద్‌ సందర్భంగా ర్యాలీ చేపట్టాయి. యూనివర్సిటీలోనే బైఠాయించి నిరసన తెలిపాయి. ఉమ్మడి పీజీసెట్‌ వల్ల రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఇప్పటికే పీజీ ప్రవేశాలు భారీగా తగ్గాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో యూనివర్సిటీలే మూత పడే ప్రమాదం ఉందన్నారు. పీజీ అడ్మిషన్లు యూనివర్సిటీలే నిర్వహించుకునేటప్పుడు యూనివర్సిటీల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అనుసరించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు శివారెడ్డి, చలపతి, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు రవి, అక్బర్‌, ఎన్‌ఎ్‌సయూఐ నేత జెన్నే మల్లికార్జున, లా విద్యార్థి సంఘ నేత సుందర్రాజు, బీసీ విద్యార్థి సంఘ నేత తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 01:57 AM