Share News

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి రెండు రోజుల జైలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:52 AM

అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జ్యుడిషియల్‌ న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్‌ శుక్రవారం తీర్పునిచ్చారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి రెండు రోజుల జైలు

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు జ్యుడిషియల్‌ న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్‌ శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ ముగ్గురినీ గతంలో ఒకటికి రెండుసార్లు హెచ్చరించినా లెక్క చేయకుండా మళ్లీ మళ్లీ ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల్లో దొరికారు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన బయన్న, తిరుపతి రిక్షాకాలనీకి చెందిన నందగోపాల్‌, తిరుమల బాలాజీనగర్‌కు చెందిన కుమార్‌కు రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 12 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరికి రూ.పది వేల వంతున రూ.1.20 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Updated Date - Feb 15 , 2025 | 01:52 AM