Share News

తుడా టవర్స్‌ వేలానికి సిద్ధం

ABN , Publish Date - Feb 23 , 2025 | 02:09 AM

తిరుపతి పట్టణాభివృద్ధి సంస (తుడా) ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్మిస్తున్న తుడా టవర్స్‌ను వేలానికి సిద్ధం చేస్తున్నారు. మార్చి 8వ తేదీ నుంచి వేలం నిర్వహిస్తున్నామని తుడా వీసీ ఎన్‌.మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరం లోని రాయలచెరువు రోడ్డులో 13 అంతస్థులలో తుడా టవర్స్‌ నిర్మాణం జరు గుతోందన్నారు. గ్రౌండ్‌, ఒకటో అంతస్థుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, రెండు, మూడు, నాలుగు అంతస్థులలో ఆఫీస్‌ల వినియోగానికి, మిగిలిన అంతస్థుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్‌ రూమ్‌ ఫ్లాట్స్‌ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. మొత్తం 250 ప్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్‌ బెడ్‌ రూమ్స్‌, 152 ట్రిపుల్‌ బెడ్‌ రూమ్స్‌, 32 నాలుగు బెడ్‌ రూమ్స్‌ ఫ్లాట్లు ఉంటాయన్నారు. విశాలమైన పార్కింగ్‌, వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్లకు వేర్వేరుగా లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2026 మార్చిలోపు అన్ని పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుంచి అన్ని అంతస్తుల విక్రయానికి వేలం నిర్వహించను న్నామని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తుడా వెబ్‌సైట్‌లో, కార్యాలయంలోని రిసెప్షన్‌ సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయ న్నారు. మార్చి 8న 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు వేలం నిర్వహిస్తామని వెల్లడిం చారు. ఈ సమావేశంలో తుడా కార్యదర్శి వెంకట నారాయణ, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర పాల్గొన్నారు.

తుడా టవర్స్‌ వేలానికి సిద్ధం
వివరాలు వెల్లడిస్తున్న వీసీ మౌర్య

. మార్చి 8 నుంచి ప్రారంభం జూ వీసీ మౌర్య వెల్లడి

తిరుపతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి) : తిరుపతి పట్టణాభివృద్ధి సంస (తుడా) ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్మిస్తున్న తుడా టవర్స్‌ను వేలానికి సిద్ధం చేస్తున్నారు. మార్చి 8వ తేదీ నుంచి వేలం నిర్వహిస్తున్నామని తుడా వీసీ ఎన్‌.మౌర్య తెలిపారు. తుడా కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరం లోని రాయలచెరువు రోడ్డులో 13 అంతస్థులలో తుడా టవర్స్‌ నిర్మాణం జరు గుతోందన్నారు. గ్రౌండ్‌, ఒకటో అంతస్థుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, రెండు, మూడు, నాలుగు అంతస్థులలో ఆఫీస్‌ల వినియోగానికి, మిగిలిన అంతస్థుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్‌ రూమ్‌ ఫ్లాట్స్‌ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. మొత్తం 250 ప్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్‌ బెడ్‌ రూమ్స్‌, 152 ట్రిపుల్‌ బెడ్‌ రూమ్స్‌, 32 నాలుగు బెడ్‌ రూమ్స్‌ ఫ్లాట్లు ఉంటాయన్నారు. విశాలమైన పార్కింగ్‌, వాణిజ్య సముదాయాలు, ఫ్లాట్లకు వేర్వేరుగా లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2026 మార్చిలోపు అన్ని పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుంచి అన్ని అంతస్తుల విక్రయానికి వేలం నిర్వహించను న్నామని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తుడా వెబ్‌సైట్‌లో, కార్యాలయంలోని రిసెప్షన్‌ సెంటర్‌లో అందుబాటులో ఉన్నాయ న్నారు. మార్చి 8న 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు వేలం నిర్వహిస్తామని వెల్లడిం చారు. ఈ సమావేశంలో తుడా కార్యదర్శి వెంకట నారాయణ, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2025 | 02:09 AM