ఐటీఐ పాసైన వారికి పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి శిక్షణ
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:01 AM
ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో చేరడానికి అర్హత పరీక్ష కోసం బ్రిడ్జి కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తామని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు అర్బన్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ఐటీఐ రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో చేరడానికి అర్హత పరీక్ష కోసం బ్రిడ్జి కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తామని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి అర్హతగా ఐటీఐలో రెండేళ్ల కోర్సు పూర్తి చేసి 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో రెండవ సంవత్సరంలో చేరడానికి నిర్వహించే అర్హత పరీక్షకు బ్రిడ్జి కోర్సులో శిక్షణను ప్రభుత్వ ఐటీఐలో ఇస్తున్నట్లు చెప్పారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఐటీఐ, పదవ తరగతి జిరాక్స్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోలతో గురువారం నుంచి వచ్చే నెల 5వ తేదిలోపు ప్రభుత్వ ఐటీఐలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తామన్నారు. ఇతర వివరాల కోసం 77996 79351 నెంబరును సంప్రదించాలని కోరారు.