Share News

దేశంలోనే టాప్‌ 10

ABN , Publish Date - Mar 05 , 2025 | 02:01 AM

ఉమ్మడి చిత్తూరు- నెల్లూరు జిల్లాల మధ్య వున్న ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ప్రాంతం పరిశ్రమల స్థాపనలో దేశంలోనే టాప్‌ 10లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో 2024లోనే రూ.12,830 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు వచ్చాయి. 11,925 మందికి ఉపాధి లభించింది. మరో 60 పెద్ద ప్రాజెక్టులు రూ.67,209 కోట్ల పెట్టుబడితో పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే, 94,026 మంది ఉపాధి లభించే అవకాశం ఉంది.విశాఖ నోడ్‌లోని అచ్యుతాపురం, చిత్తూరు నోడ్‌లోని నాయుడుపేటల్లోని ఇండస్ర్టియల్‌ పార్కుల్లోని పరిశ్రమలు మహిళా ఉద్యోగులకు సమాన వేతనం, ప్రసూతి సెలవులు, సంక్షేమం, పని ప్రదేశాల్లో భద్రత వంటి విషయాల్లో నిబంధనలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఆయా ప్రాంతాల్లోని 120 పరిశ్రమలు ప్రస్తుతం ఈ నిబంధనల్ని పాటిస్తున్నాయి.

దేశంలోనే టాప్‌ 10
చిత్తూరు-నెల్లూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌

చిత్తూరు-నెల్లూరు ఇండస్ర్టియల్‌ కారిడార్‌

ఉమ్మడి చిత్తూరు- నెల్లూరు జిల్లాల మధ్య వున్న ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ప్రాంతం పరిశ్రమల స్థాపనలో దేశంలోనే టాప్‌ 10లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో 2024లోనే రూ.12,830 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు వచ్చాయి. 11,925 మందికి ఉపాధి లభించింది. మరో 60 పెద్ద ప్రాజెక్టులు రూ.67,209 కోట్ల పెట్టుబడితో పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే, 94,026 మంది ఉపాధి లభించే అవకాశం ఉంది.విశాఖ నోడ్‌లోని అచ్యుతాపురం, చిత్తూరు నోడ్‌లోని నాయుడుపేటల్లోని ఇండస్ర్టియల్‌ పార్కుల్లోని పరిశ్రమలు మహిళా ఉద్యోగులకు సమాన వేతనం, ప్రసూతి సెలవులు, సంక్షేమం, పని ప్రదేశాల్లో భద్రత వంటి విషయాల్లో నిబంధనలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఆయా ప్రాంతాల్లోని 120 పరిశ్రమలు ప్రస్తుతం ఈ నిబంధనల్ని పాటిస్తున్నాయి.

2024-25 సామాజిక, ఆర్థిక సర్వేని రాష్ట్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గత ఆర్థిక, విద్యా సంవత్సరాల ఆధారంగా ఈ నివేదిక పలు అంశాలను వెల్లడించింది. ఆయా అంశాల్లో మన జిల్లా ఏ స్థానంలో ఉంది.. సాధించిన ప్రగతి ఎంత.. అనే వివరాలు ఇందులో ఉన్నాయి.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

ఫ శ్రీకాళహస్తి- ఏర్పేడు క్లస్టర్‌ అభివృద్ధికి రూ.436 కోట్లు

వైజాగ్‌- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ పరిధిలో వైజాగ్‌, చిత్తూరు, కొప్పర్తి ఇండస్ర్టియల్‌ నోడ్స్‌ ఉన్నాయి. 33 వేల ఎకరాల్లో ప్లాన్‌ చేస్తుండగా, ఇందులో 30 శాతం స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. శ్రీకాళహస్తి- ఏర్పేడు క్లస్టర్‌ (చిత్తూరు నోడ్‌) కింద 2628 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. రూ.463 కోట్ల అంచనాతో మౌలిక వసతులు కల్పించనున్నారు.

ఫ మహిళలకు రూ.25.03 కోట్ల సబ్సిడీ

జిల్లాలో మొత్తం 1379 రేషన్‌ దుకాణాలుండగా.. అంత్యోదయ, తెల్ల రేషన్‌కార్డులు కలిపి 5,43,282 ఉన్నాయి. వీటికిగానూ నెలకు 9306 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అలాగే దీపం-2 పథకం కింద జిల్లాలో 3,09, 070 మంది లబ్ధిదారులు ఇప్పటివరకు రూ.25.03 కోట్ల సబ్సిడీని పొందారు. జిల్లా లో 487,631 దీపం కింద, 4212 సీఎ్‌సఆర్‌, 14,960 పీఎంయూవై, 197963 జనరల్‌ కనెక్షన్స్‌.. మొ త్తంగా 7,04,767 ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి.

ఫ ఏనుగుల నష్టం రూ.73.40 లక్షలు

జిల్లాలో 32 ఏనుగులు పలు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా తిరుగాడుతూ పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. అప్పుడప్పుడూ మనుషుల ప్రాణాలూ తీస్తున్నాయి. గాయపరుస్తున్నాయి.2024వ సంవత్సరంలో ప్రభుత్వం రూ.73.40 లక్షల పరిహారాన్ని జిల్లాలో గజ బాధిత కుటుంబాలకు పంపిణీ చేసింది.

ఫ ఎర్రచందనానికి రూ.కోట్లతో రక్షణ

రెడ్‌సాండర్స్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ ద్వారా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, నల్లమల, తలకోన కొండల్లోని 5300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఎర్రచందనం చెట్ల రక్షణకోసం 2023-24వ సంవత్సరంలో రూ.25 కోట్లను కేటాయించగా, రూ.15.29 కోట్లను ఖర్చు చేశారు. అలాగే 2024 ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రూ.8.22 కోట్లను, ఆగస్టు నుంచి నవంబరు వరకు రూ.9.34 కోట్లను కేటాయించారు.

ఫ మల్బరీలో ముందంజ

జిల్లాలో 44,466 ఎకరాల్లో 28,380 మంది రైతులు మల్బరీని పండిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 20714.6 మెట్రిక్‌ టన్నుల పట్టు గూళ్లు, 2858 మెట్రిక్‌ టన్నుల పట్టు ఉత్పత్తి అయింది. జిల్లాలో 18 అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీల గోడౌన్లు 17,950 మెట్రిన్‌ టన్నుల కెపాసిటీతో ఉన్నాయి. జిల్లాలో 2024 డిసెంబరు వరకు రూ.6.83 కోట్ల మార్కెట్‌ ఫీజు వసూలైంది.

ఫ 53.862

మెట్రిక్‌ టన్నుల

మాంసం ఉత్పత్తి

జిల్లాలో గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 917.223 మెట్రిక్‌ టన్నుల పాలు, 53.862 మెట్రిక్‌ టన్నుల మాంసం, 10428.184 మెట్రిక్‌ టన్నుల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి.

ఫ కోట్లలో డిపాజిట్లు

జిల్లాలో మొత్తం 283 బ్యాంకు బ్రాంచులు ఉండగా.. వాటిలో రూ.14,703.11 కోట్లను డిపాజిట్‌ చేసుకోగా.. బ్యాంకులు రూ.21,100.81 కోట్లను రుణాలుగా ఇచ్చాయి.

ఫజిల్లాలో 2023-24లో రవాణా వాహనాల రిజిస్ర్టేషన్‌ ద్వారా రూ.118.2 కోట్లు, 2024 డిసెంబరు వరకు రూ.97.69 కోట్లు వసూలైంది.

ఫకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిసెంబరు ఆఖరు వరకు జిల్లాలో 319,391 మంది ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా చికిత్స పొందగా.. వారి కోసం రూ.658 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఫ2024-25 సంవత్సరానికి 2024 డిసెంబరు వరకు 2,72,320 మంది అర్హులకు రూ.984.65 కోట్ల ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.

ఫకుప్పంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో 3,36,500 అంటుకట్టిన కూరగాయాల మొలకలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచారు. 2025-26 సంవత్సరంలో ఇక్కడ మరో 87 లక్షల అంటుకట్టిన, అంటుకట్టని మొలకలను ఉత్పత్తి చేయనున్నారు.

Updated Date - Mar 05 , 2025 | 02:01 AM