వడగాడ్పులు మొదలయ్యాయి
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:45 AM
మార్చి తొలివారంలోనే ఎండలు మండుతున్నాయి. వడగాడ్పులూ మొదలయ్యాయి. మరో మూడునెలలు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మార్చి తొలివారంలోనే ఎండలు మండుతున్నాయి. వడగాడ్పులూ మొదలయ్యాయి. మరో మూడునెలలు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 39.1 డిగ్రీల వరకు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా తవణంపల్లెలో 39.1, అత్యల్పంగా రామకుప్పంలో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాలవారీగా.. గంగవరంలో 38.6, పులిచెర్లలో 38.1, చిత్తూరు, గుడిపాల, నగరిలో 38, నిండ్ర, శ్రీరంగరాజపురంలో 37.7, ఐరాల, గుడుపల్లె, శాంతిపురంలో 37.2, గంగాధరనెల్లూరులో 37.1, రొంపిచెర్లలో 36.8, వి.కోటలో 36.7, చౌడేపల్లె, పాలసముద్రం, విజయపురంలో 36.4, పెద్దపంజాణిలో 36.3, యాదమరిలో 36.2, బంగారుపాళ్యంలో 35.9, కుప్పం, పూతలపట్టులో 35.6, పెనుమూరులో 35.3, సదుం, వెదురుకుప్పంలో 35.1, సోమలలో 35, పలమనేరులో 34.9, బైరెడ్డిపల్లెలో 34.5, కార్వేటినగరంలో 34.3, పుంగనూరులో 34.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.