పరీక్ష రాసిన నవవధువు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:57 AM
పసుపు వస్త్రాలు. తలపై జీలకర్ర, బెల్లం. కాళ్లకు పారాణితో నవ వధువు మమత ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాశారు. తిరుపతికి చెందిన ఈమెకు ఉదయం చిత్తూరులో వివాహమైంది. అటు నుంచి నేరుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఇలా కొత్త పెళ్లికూతురు పరీక్షా కేంద్రానికి రావడం ప్రత్యేకంగా నిలిచింది.

పసుపు వస్త్రాలు. తలపై జీలకర్ర, బెల్లం. కాళ్లకు పారాణితో నవ వధువు మమత ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాశారు. తిరుపతికి చెందిన ఈమెకు ఉదయం చిత్తూరులో వివాహమైంది. అటు నుంచి నేరుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఇలా కొత్త పెళ్లికూతురు పరీక్షా కేంద్రానికి రావడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక, తలపై జీలకర్ర, బెల్లం తొలగించాలని సిబ్బంది చెప్పగా, ఆమె నిరాకరించారు. దీనిపై ప్రిన్సిపల్ నారాయణమ్మ ఉన్నతాధికారులతో మాట్లాడగా.. వారి సూచన మేరకు తనిఖీ చేసి ఆమెను పరీక్షకు అనుమతించారు.
- తిరుపతి(విద్య), ఆంధ్రజ్యోతి