Share News

వైభవంగా తై అమావాస్య వేడుకలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:12 AM

కాణిపాక ఆలయంలో బుధవారం తై అమావాస్య వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలోని వరసిద్ధుడి మూల విరాట్‌కు ఉభయదారు కాకర్లవారిపల్లెకు చెందిన పట్టాభి నాయుడు ఆధ్వర్యంలో అభిషేకాన్ని నిర్వహించారు.

వైభవంగా తై అమావాస్య వేడుకలు
వరసిద్ధుడికి గ్రామోత్సవం

ఐరాల(కాణిపాకం), జనవరి 29(ఆంధ్రజ్యోతి):కాణిపాక ఆలయంలో బుధవారం తై అమావాస్య వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలోని వరసిద్ధుడి మూల విరాట్‌కు ఉభయదారు కాకర్లవారిపల్లెకు చెందిన పట్టాభి నాయుడు ఆధ్వర్యంలో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు.ఈవో పెంచలకిషోర్‌, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 02:12 AM