30 రోజుల్లో తెలుగు రీడింగ్ ఛాలెంజ్
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:23 AM
30 రోజుల్లో తెలుగు రీడింగ్ ఛాలెంజ్.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలుగు భాషను స్పష్టంగా చదివేలా నేర్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది.

నేటినుంచి రెండు పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు
తిరుపతి(విద్య), ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): 30 రోజుల్లో తెలుగు రీడింగ్ ఛాలెంజ్.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలుగు భాషను స్పష్టంగా చదివేలా నేర్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమిది. తిరుపతికి చెందిన భాస్కర్‌రాజు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో తిరుపతి నగరం సంజయ్‌గాంధీ కాలనీలోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల, చంద్రగిరిలోని జేఆర్‌కేఆర్‌ఎం పాఠశాలలో శుక్రవారం నుంచి 30 రోజులపాటు పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. ఈ మేరకు డీఈవో కేవీఎన్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాలల్లోని 2, 3 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చి 30 రోజుల్లోనే 10వ తరగతి పాఠ్యపుస్తకాలను ధారాళంగా చదివేలా చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అన్ని పాఠశాలల్లోనూ ప్రారంభించనున్నారు.