వైభవంగా స్వర్ణ రథోత్సవం
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:03 AM
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవర్లను వాహన మండపానికి తీసుకొచ్చి విశేషంగా అలంకరించారు.

చంద్రగిరి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవర్లను వాహన మండపానికి తీసుకొచ్చి విశేషంగా అలంకరించారు. అనంతరం స్వర్ణరథంపై అధిష్ఠింపచేసి సంకల్ప పూజలు నిర్వహించారు. స్వర్ణ రథానికి ఏర్పాటు చేసిన మోకులను గోవింద నామస్మరణ చేస్తూ టీటీడీ అధికారులు, భక్తులు నెమ్మదిగా లాగారు. స్వామి వారు ఆలయ తిరుమాడ వీధులో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, స్వామివారు ఉదయం హనుమంతు వాహనం, రాత్రి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.