స్వర్ణపంచాయత్
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:14 AM
పంచాయతీల్లో ఎటువంటి లావాదేవీలైనా ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపైసాకు లెక్క ఉంటుంది. పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో గృహాల పన్నులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది అసె్‌సమెంట్ల వారీగా వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. డిమాండ్ ప్రకారం నగదును ఫోన్ పే, పేటీఎం, నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్రామీణ ప్రజలు పన్నులు చెల్లించవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాబోవు రోజుల్లో పంచాయతీరాజ్‌లో టెక్నాలజీని విరివిగా ఉపయోగించనున్నారు. జియో మ్యాపింగ్ చేసి ఉండడం వల్ల మార్కెట్‌ను బట్టి ఆటోమేటిక్గా పన్ను డిమాండ్‌ను ఫిక్స్ చేస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం విద్యుత్ బిల్లు తరహాలో పన్నులు చెల్లించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

- త్వరలోనే అందుబాటులోకి రానున్న వెబ్‌సైట్
- ఆపై గ్రామాల్లో సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..
- పారదర్శకతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట
వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సర్పంచ్ పదవులకు విలువ లేకుండా చేసి, అభివృద్ధి పనులను అటకెక్కించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు పెద్దపీట వేసింది. ఇపుడు పారదర్శకంగా సేవలు అందించడంలో భాగంగా స్వర్ణపంచాయత్ వెబ్‌సైట్‌ను రూపొందించింది.
- గంగాధరనెల్లూరు, ఆంధ్రజ్యోతి
స్వర్ణపంచాయత్ (జ్ట్టిఞట://టఠ్చీటుఽ్చఞ్చుఽఛిజ్చిడ్చ్ట.్చఞఛిజటట.జీుఽ/) వెబ్‌సైట్ అందుబాటులోకి వస్తే అక్రమాలకు చెక్ పడనుంది. గతంలో పలు గ్రామాల్లో ప్రజలనుంచి వసూలైన పన్నులు దుర్వినియోగం జరిగిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చేది. దీనిపై విచారించడం పరిపాటిగా మారింది. వీటన్నింటికీ ఈ వెబ్‌సైట్‌తో అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు.
లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లో..
పంచాయతీల్లో ఎటువంటి లావాదేవీలైనా ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపైసాకు లెక్క ఉంటుంది. పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో గృహాల పన్నులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది అసె్‌సమెంట్ల వారీగా వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. డిమాండ్ ప్రకారం నగదును ఫోన్ పే, పేటీఎం, నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్రామీణ ప్రజలు పన్నులు చెల్లించవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాబోవు రోజుల్లో పంచాయతీరాజ్‌లో టెక్నాలజీని విరివిగా ఉపయోగించనున్నారు. జియో మ్యాపింగ్ చేసి ఉండడం వల్ల మార్కెట్‌ను బట్టి ఆటోమేటిక్గా పన్ను డిమాండ్‌ను ఫిక్స్ చేస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం విద్యుత్ బిల్లు తరహాలో పన్నులు చెల్లించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
వెబ్‌సైట్‌లో ఉండే వివరాలు
వెబ్‌సైట్‌లో మొదటగా పంచాయతీ ముఖచిత్రం ఉంటుంది. ఆ పంచాయతీలోని ప్రతి ఇంటి విస్తీర్ణం, హద్దులు, యాజమాని వివరాలు, ఏడాదికి ఎంతపన్ను చెల్లిస్తున్నారు, ఆస్తి వ్యాపార సముదాయాలకు సంబంధించి పన్నులు, చెరువులు, స్థలాలు, లీజు, సెల్ టవర్లు, పరిశ్రమలు, రోజువారీ వ్యాపారాలనుంచి చేస్తున్న వసూళ్లు.. ఇలా పంచాయతీలకు ఆదాయం వచ్చే అన్ని వివరాలు ఉంటాయి.
సేవలన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చు
స్వర్ణపంచాయతీ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చాక సేవలన్నీ ఆన్‌లైన్‌లో పొందవచ్చు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, అనుమతులు ఆన్‌లైన్ ద్వారా తీసుకోవచ్చు. ఇంటిపన్ను, ఇతరత్రా రుసుంను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. పన్నులు రూపంలో వసూలయ్యే నగదు దుర్వినియోగం కాకుండా, ప్రజలకు పారదర్శకంగా చూపించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం. పైగా పంచాయతీల పురోభివృద్ధికి ఈ వెబ్‌సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులో రానుంది.
- మారం హరిప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో, గంగాధరనెల్లూరు మండలం