అసభ్య ప్రవర్తనతో టీచర్ సస్పెన్షన్
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:52 AM
విద్యార్థినులపట్ల అసభ్యకరంగా వ్యవహరించిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యాశాఖ అధికారుల కథనం మేరకు ... చిత్తూరులోని కట్టమంచి నగరపాలక ఉన్నత పాఠశాలలో సోషియల్ టీచర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ కొంత కాలంగా అసభ్యంగా ప్రవరిస్తుండడం భరించలేక టెన్త్ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల హెచ్‌ఎంతో పాటు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చిత్తూరు సెంట్రల్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థినులపట్ల అసభ్యకరంగా వ్యవహరించిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యాశాఖ అధికారుల కథనం మేరకు ... చిత్తూరులోని కట్టమంచి నగరపాలక ఉన్నత పాఠశాలలో సోషియల్ టీచర్‌గా పనిచేస్తున్న ధనశేఖర్ కొంత కాలంగా అసభ్యంగా ప్రవరిస్తుండడం భరించలేక టెన్త్ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాఠశాల హెచ్‌ఎంతో పాటు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటు విద్యాశాఖ నుంచి ఎంఈవో-2 మోహన్ కూడా విచారణ చేపట్టారు. పాఠశాలలో విద్యార్థినులతో పాటు పలువురిని విచారించగా ధనశేఖర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తేలింది.డీఈవో వరలక్ష్మికి నివేదిక సమర్పించడంతో ఆమె ధనశేఖర్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ జయరామయ్య తెలిపారు.