అంగన్వాడీలకు చిన్నసైజు గుడ్ల సరఫరా
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:03 AM
గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాల వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వస్తున్నాయని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్‌ప్రతాప్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన చిత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు.ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంట్రాక్టర్లు చిన్నసైజు కోడిగుడ్లను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు తన పర్యటనలో గుర్తించానన్నారు.టెండర్‌లో పేర్కొన్న విధంగా పెద్దసైజు కోడిగుడ్లను సరఫరా చేసేలా కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డీఎస్వో శంకరన్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

. ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్‌ప్రతాప్ రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాల వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వస్తున్నాయని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్‌ప్రతాప్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన ఆయన చిత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు.ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంట్రాక్టర్లు చిన్నసైజు కోడిగుడ్లను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు తన పర్యటనలో గుర్తించానన్నారు.టెండర్‌లో పేర్కొన్న విధంగా పెద్దసైజు కోడిగుడ్లను సరఫరా చేసేలా కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. డీఎస్వో శంకరన్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా తనిఖీలు : రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ విజయ్‌ప్రతాప్ రెడ్డి మంగళవారం పూతలపట్టు, పెనుమూరు, శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు, బంగారుపాళ్యం, పలమనేరు, పుంగనూరు మండలాల్లో పర్యటించారు. స్థానిక అంగన్వాడీలను, చౌకదుకాణాలను, ఎండీయూ వాహనాలను, పీహెచ్‌సీలను, వసతిగృహాలను, మండల లెవల్ స్టాక్ పాయింట్లను, గురుకుల, జడ్పీ పాఠశాలలను తనిఖీ చేశారు. డీఎస్వో శంకరన్, సివిల్ సప్లయ్ డీఎం బాలకృష్ణ, డీఈవో వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, సాంఘిక, వెనుకబడిన సంక్షేమశాఖల డీడీలు చెన్నయ్య, రబ్బాని బాషా, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.