పాకాలలో భూసార రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:52 AM
రాయలసీమలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మామిడి దిగుబడి అవుతోంది.

రాయలసీమలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మామిడి దిగుబడి అవుతోంది. ఇక్కడి భూసారానికి.. ఇతర ప్రాంతాల్లోని భూసారం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నూజివీడులో భూసారవంత పరీక్షల సెంటర్ ఉండటం వల్ల అక్కడ మామిడి రైతులు భూసార పరీక్షలు చేసి, అందుకు తగిన ఎరువులు వాడటం వల్ల లాభాలు గడిస్తున్నారు. పాకాల మండలంలో మామిడి పంటకు జోన్‌గా ఉంది. అక్కడ భూసార పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇది రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
- పులివర్తి నాని, చంద్రగిరి ఎమ్మెల్యే