ముక్కంటి ఆలయంలో శాంతి అభిషేకం
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:58 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం శాంతి అభిషేకం నిర్వహించారు.

శ్రీకాళహస్తి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం శాంతి అభిషేకం నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఉత్సవర్లకు శాంతి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఆలయంలోని అలంకార మండపం వద్ద ఉత్సవర్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అభిషేకాలు చేవారు. ఉత్సవాల్లో తెలియక పొరపాట్లు జరిగుంటే ప్రాయశ్చిత్తం కలిగేలా ఉత్సవమూర్తులకు హోమం ద్వారా శాంతి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, అధికారులు, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, విజయకుమార్ పాల్గొన్నారు.