తిరుపతి నగరంలో 144 సెక్షన్
ABN , Publish Date - Feb 04 , 2025 | 01:46 AM
డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు తిరుపతి నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్), ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు తిరుపతి నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం తెలిపారు. అదనపు బలగాలతో బందోబస్తుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.