స్కాన్ చేయండి.. అభిప్రాయం చెప్పండి
ABN , Publish Date - Feb 15 , 2025 | 02:00 AM
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇందుకోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి.. పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు
వైద్య సేవలపై ప్రభుత్వం సర్వే
చిత్తూరు రూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఇందుకోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసి.. పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రశ్నలు ఇవే..
ఫ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉన్నారా ఫ వైద్యుల ప్రవర్తన ఎలా ఉంది ఫ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది ఫ ఆస్పత్రిలో రాసిన మందులు ఇచ్చారా ఫ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా ఫ ఆస్పత్రి పరిశుభ్రంగా ఉందా.. అనే ప్రశ్నలకు అవును, కాదు తరహాలో ఎంపిక చేసి నమోదు చేయాల్సి ఉంటుంది.
ఐవీఆర్‌ఎస్ ద్వారా కూడా..
ఆస్పత్రిలో చికిత్స తర్వాత ఇన్ పేషంట్లకు ఐవీఆర్‌ఎస్ ద్వారా కూడా కాల్ చేసి కూడా వైద్యసేవలను ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇందులో ఫ వైద్యం ఎలా అందించారు ఫ సౌకర్యాలు ఎలా ఉన్నాయి. ఫ చికిత్స సమయంలో వైద్యులు, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది.. అన్న ప్రశ్నలు ఉన్నాయి. వైద్య రంగానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నా రోగులు అసంతృప్తితో ఉన్నారని.. దీన్ని గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాలుకు శ్రీకారం చుట్టారు.
అవగాహన కల్పించాలి
క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారే కానీ.. అవి ఎందుకు పెట్టారన్న దానిపై రోగులకు అవగాహన కల్పించలేదు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్‌లు కూడా చిన్నవిగా, ఎక్కడో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌ను పెద్ద బ్యానర్ కింద ప్రత్యేకంగా ప్రదర్శిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.