అర్జీల పరిష్కారం సత్వరం జరగాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:56 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం సత్వరం జరగాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీతో కలిసి పీజీఆర్‌ఎస్ అర్జీలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు బాధ్యతగా పనిచేసి, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలు మినహా.. మిగిలిన వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. పరిష్కరించలేనివి ఎందుకనే పూర్తి వివరణ ఇవ్వాలని సూచించారు.

చిత్తూరు సెంట్రల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం సత్వరం జరగాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీతో కలిసి పీజీఆర్‌ఎస్ అర్జీలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు బాధ్యతగా పనిచేసి, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలు మినహా.. మిగిలిన వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. పరిష్కరించలేనివి ఎందుకనే పూర్తి వివరణ ఇవ్వాలని సూచించారు.