Share News

ప్రశాంతంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

ABN , Publish Date - Feb 24 , 2025 | 01:59 AM

తిరుపతిలోని 13 కేంద్రాల్లో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి 12.30 గంటలవరకు.. మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు.

ప్రశాంతంగా గ్రూప్‌-2 మెయిన్స్‌
శ్రీపద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కేంద్రానికి చేరుకుంటున్న అభ్యర్థులు

ఉదయం 5,055, మధ్యాహ్నం 5,046 మంది హాజరు

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని 13 కేంద్రాల్లో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి 12.30 గంటలవరకు.. మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 5,801మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ఉదయం సెషన్‌లో 5,055 మంది పరీక్ష రాయగా, 746 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 5,046 మంది రాగా, 755 గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరిని పోలీసులు క్షుణ్నంగా తనిఖీచేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఆర్వో నరసింహులు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - Feb 24 , 2025 | 01:59 AM