శివయ్యకు పట్టువస్త్రాల సమర్పణ
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:54 AM
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు.

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం పట్టువస్త్రాలను సమర్పించారు. జ్ఞానప్రసూనాంబిక అతిథి గృహం వద్ద మంత్రికి స్వాగతం పలికి ఊరేగింపుగా ఆలయం లోపలకు తీసుకొచ్చారు. అలంకార మండపంలో ఉత్సవర్ల వద్ద పట్టువస్త్రాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈవో బాపిరెడ్డికి అందజేశారు. వాటిని స్వామి అమ్మవార్లకు ధరింపజేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్ష అని మీడియాతో మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.