Kanipakam: కాణిపాకంలో ‘ఆక్టోపస్’ మాక్ డ్రిల్
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:28 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయం వద్ద ఆక్టోపస్ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచలకిషోర్, ఏఎస్పీ నందకిషోర్, ఆక్టోపస్ డీఎస్పీ తిరుమలయ్య మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ఆలయం వద్ద ఏదైనా దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, యాత్రికులను ఏవిధంగా కాపాడాలన్న దానిపై మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు. ఆలయ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు, ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిత్యం పోలీసులు, హోంగార్డులు ఆలయాన్ని, భక్తులను కాపాడేందుకు కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయినాథ్, సీఐ శ్రీధర్‌నాయుడు, తహసీల్దార్ లోకేశ్వరి, డాక్టర్ రాజేశ్వరి, ఏఈవో రవీంద్రబాబు, ఏఈలు శివాంజనేయులు, పవన్, ఎస్‌ఐ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.