అమ్మ అలక చూడతరమా!
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:42 AM
శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. గంగాదేవిని వివాహమాడాడని తెలిసి పరమశివుడిపై అలకబూనిన ఆదిశక్తిని బుజ్జగించేందుకు పరమశివుడు ప్రయత్నించడమే పల్లకి సేవలో ప్రధానాంశం. జ్ఞానప్రసూనాంబ దేవి పల్లకిలో ఆశీనురాలై ఎదురుగా ఉన్న దర్పణంలో భక్తులకు దర్శనమిస్తారు. సౌందర్య లహరి అయిన ఆదిశక్తి అలకలోనూ అద్వితీయమైన తేజస్సుతో భక్తులకు దర్పణంలో దర్శనమిచ్చారు. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను విశేష స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం వాహన మండపం వద్ద విద్యుత్తు కాంతులతో సిద్ధమైన పల్లకీల్లో ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. సకల పరివార దళం ముందు సాగగా స్వామి, అమ్మవార్లు చిద్విలాసులై భక్తులకు దర్శనభాగ్యం కల్పించి కరుణామృతం కురిపించారు. కోలాట నృత్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, కేరళవాయిద్యాలు, బ్యాండు, మంగళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శివనామస్మరణతో చతుర్మాడవీధులు మార్మోగాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే పల్లకీ సేవ చిట్టచివరి ఊరేగింపుగా నిర్వహిస్తారు. అందుకని స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా
ఆదిదంపతుల పల్లకిసేవ
శ్రీకాళహస్తి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరుడి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పల్లకి సేవ వైభవంగా జరిగింది. గంగాదేవిని వివాహమాడాడని తెలిసి పరమశివుడిపై అలకబూనిన ఆదిశక్తిని బుజ్జగించేందుకు పరమశివుడు ప్రయత్నించడమే పల్లకి సేవలో ప్రధానాంశం. జ్ఞానప్రసూనాంబ దేవి పల్లకిలో ఆశీనురాలై ఎదురుగా ఉన్న దర్పణంలో భక్తులకు దర్శనమిస్తారు. సౌందర్య లహరి అయిన ఆదిశక్తి అలకలోనూ అద్వితీయమైన తేజస్సుతో భక్తులకు దర్పణంలో దర్శనమిచ్చారు. తొలుత ఆలయంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను విశేష స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం వాహన మండపం వద్ద విద్యుత్తు కాంతులతో సిద్ధమైన పల్లకీల్లో ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. సకల పరివార దళం ముందు సాగగా స్వామి, అమ్మవార్లు చిద్విలాసులై భక్తులకు దర్శనభాగ్యం కల్పించి కరుణామృతం కురిపించారు. కోలాట నృత్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, కేరళవాయిద్యాలు, బ్యాండు, మంగళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శివనామస్మరణతో చతుర్మాడవీధులు మార్మోగాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే పల్లకీ సేవ చిట్టచివరి ఊరేగింపుగా నిర్వహిస్తారు. అందుకని స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
నేడు ఏకాంత సేవ
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు ఏకాంత సేవ జరగనుంది. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ఉన్న పళ్లియర (శయన మందిరం)లో ఈ క్రతువును నిర్వహించనున్నారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను వెండి పల్లకిలో ప్రదక్షిణగా తిప్పి శయన మందిరంలో కొలువుదీర్చనున్నారు.
రేపటినుంచి ఆర్జిత సేవలు ప్రారంభం
ముక్కంటి ఆలయంలో స్వామిఅమ్మవార్లకు నిర్వహించే ఆర్జిత సేవలు గురువారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దుచేసి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. బుధవారంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఈక్రమంలో గురువారం నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి.