కల్తీ నెయ్యి కేసులో నిందితులకు రుయాలో వైద్య పరీక్షలు
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:45 AM
కల్తీ నెయ్యి కేసులో నిందితులైన రాజశేఖర్, పోమిల్‌జైన్, అపూర్వ, విపిన్‌జైన్‌కు శుక్రవారం సిట్ అధికారులు రుయాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

తిరుపతి(వైద్యం), ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి కేసులో నిందితులైన రాజశేఖర్, పోమిల్‌జైన్, అపూర్వ, విపిన్‌జైన్‌కు శుక్రవారం సిట్ అధికారులు రుయాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వీరిని సిట్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో అలిపిరి, వెస్ట్ సీఐలు రామకిశోర్, మురళీమోహన్ వైద్య పరీక్షల నిమిత్తం 11.30 గంటలకు రుయా అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. సీఎంవో అన్వేష్ ఆధ్వర్యంలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. తిరిగి 11.50 గంటలకు తీసుకెళ్లారు.