Share News

మహిళా యూనివర్శిటీలో క్రీడామణిహారం

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:54 AM

పద్మావతి మహిళా యూనివర్శిటీలో క్రీడోత్సాహం వెల్లివిరియనుంది. వర్సిటీలో మహిళా క్రీడాకారులను మరింత పోత్సాహించేందుకు అఽధునాతన మైదానం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ప్రశాంత వాతారణంలో మల్టీపర్పస్‌ స్టేడియం ఏర్పాటుకు ఖేలో ఇండియా కింద కేంద్రం రూ. 4.5కోట్లు మంజూరు చేసింది. వర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ ద్వారా మరో రూ.1.25కోట్లు వెచ్చించింది. 2022లో పోలీసు హౌసింగ్‌ బోర్డు ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభించింది. కాస్త ఆలస్యమైనా అధునాతన హంగులతో స్టేడియం రూపుదిద్దుకుంది. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులనూ సమకూర్చింది. ఈ వారంతంలోనే రంగుల పనులను కూడా పూర్తి చేయనున్నాన్నారు. స్టేడియం అందుబాటులో వస్తే ఒకే వేదికలో ఐదు క్రీడాంశాలను నిర్వహించవచ్చు. శాప్‌చైర్మన్‌ రవినాయుడు స్టేడియం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై దృష్టిసారించినట్లు సమాచారం.

మహిళా యూనివర్శిటీలో క్రీడామణిహారం

-సిద్ధమైన మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్డేడియం

-ఒకే వేదికలో ఐదు క్రీడాంశాలకు అవకాశం

తిరుపతి(క్రీడలు), జనవరి 24(ఆంధ్రజ్యోతి): పద్మావతి మహిళా యూనివర్శిటీలో క్రీడోత్సాహం వెల్లివిరియనుంది. వర్సిటీలో మహిళా క్రీడాకారులను మరింత పోత్సాహించేందుకు అఽధునాతన మైదానం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ప్రశాంత వాతారణంలో మల్టీపర్పస్‌ స్టేడియం ఏర్పాటుకు ఖేలో ఇండియా కింద కేంద్రం రూ. 4.5కోట్లు మంజూరు చేసింది. వర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ ద్వారా మరో రూ.1.25కోట్లు వెచ్చించింది. 2022లో పోలీసు హౌసింగ్‌ బోర్డు ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభించింది. కాస్త ఆలస్యమైనా అధునాతన హంగులతో స్టేడియం రూపుదిద్దుకుంది. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులనూ సమకూర్చింది. ఈ వారంతంలోనే రంగుల పనులను కూడా పూర్తి చేయనున్నాన్నారు. స్టేడియం అందుబాటులో వస్తే ఒకే వేదికలో ఐదు క్రీడాంశాలను నిర్వహించవచ్చు. శాప్‌చైర్మన్‌ రవినాయుడు స్టేడియం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై దృష్టిసారించినట్లు సమాచారం.

ఐదు క్రీడాంశాలకు ఆవకాశం

వర్సిటీ వెనుకభాగంలో సువిశాల ప్రాంగణంలో రెండంతస్తులతో నిర్మించిన స్డేడియంలో ఉడెన్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టులు, వాలీబాల్‌ కోర్టు, యోగా, టేబుల్‌టెన్నిస్‌, జిమ్‌హాళ్లు వేర్వేరుగా ఉన్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా విశ్రాంతి, డ్రెస్సింగ్‌ గదులతోపాటు లిఫ్టు సదుపాయం కూడా కల్పించారు. ముఖద్వార పైభాగంలో వివిధ ఆటగాళ్ల ప్రతిరూపాలు ఆకట్టుకుంటున్నాయి.

Updated Date - Jan 25 , 2025 | 12:54 AM