Share News

శోకసంద్రంలో కందువారిపల్లె పంచాయతీ

ABN , Publish Date - Jan 20 , 2025 | 01:33 AM

ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్‌ రాకే్‌షచౌదరి మృతిచెందడంతో కందులవారిపల్లె పంచాయతీలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ఘటన తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి శనివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తనయుడు వినీల్‌, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, టీడీపీ నాయకులు చేరుకున్నారు. చంద్రగిరి సీహెచ్‌సీలో పోస్టుమార్టం పూర్తయ్యాక ఆదివారం ఉదయం 10 గంటలకు రాకే్‌షచౌదరి భౌతికకాయాన్ని స్వగ్రామమైన మామిడిమానుగడ్డకు తరలించారు. అప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. నాని, రవినాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు పాడె మోశారు. భౌతికకాయంపై టీడీపీ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్‌ దివాకర్‌రెడ్డి, నాయకులు సుధారెడ్డి, వీరపల్లి హేమాంబరదరరావు, సుబ్రమణ్యంనాయుడు, ఈశ్వర్‌రెడ్డి, సింగు సుధా, గౌస్‌బాషా, బాలకృష్ణమూర్తి, కొండూరు ప్రవీణ్‌రాయల్‌ తదితరులు నివాళులర్పించారు.

శోకసంద్రంలో కందువారిపల్లె పంచాయతీ
పాడె మోస్తున్న ఎమ్మెల్యే పులివర్తి నాని, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు

- ఉప సర్పంచి రాకేష్‌ చౌదరికి కన్నీటి వీడ్కోలు

- పాడె మోసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ నేతలు

చంద్రగిరి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్‌ రాకే్‌షచౌదరి మృతిచెందడంతో కందులవారిపల్లె పంచాయతీలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ఘటన తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి శనివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తనయుడు వినీల్‌, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, టీడీపీ నాయకులు చేరుకున్నారు. చంద్రగిరి సీహెచ్‌సీలో పోస్టుమార్టం పూర్తయ్యాక ఆదివారం ఉదయం 10 గంటలకు రాకే్‌షచౌదరి భౌతికకాయాన్ని స్వగ్రామమైన మామిడిమానుగడ్డకు తరలించారు. అప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. నాని, రవినాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు పాడె మోశారు. భౌతికకాయంపై టీడీపీ జెండా కప్పి అంత్యక్రియలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్‌ దివాకర్‌రెడ్డి, నాయకులు సుధారెడ్డి, వీరపల్లి హేమాంబరదరరావు, సుబ్రమణ్యంనాయుడు, ఈశ్వర్‌రెడ్డి, సింగు సుధా, గౌస్‌బాషా, బాలకృష్ణమూర్తి, కొండూరు ప్రవీణ్‌రాయల్‌ తదితరులు నివాళులర్పించారు.

పార్టీ అండగా ఉంటుంది: నాని

రాకేష్‌ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే నాని భరోసా ఇచ్చారు. టీడీపీ నుంచి రూ.5 లక్షల బీమా వస్తుందని టీడీపీ నాయకులు తెలిపారు. మంచివ్యక్తిని కోల్పోయామని సినీనటుడు నారారోహిత్‌ ట్వీట్‌ చేశారు. కాగా, అటవీశాఖ అధికారులు తీసుకొచ్చిన రూ.10 లక్షల చెక్కును.. విషాదంలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు తిరస్కరించినట్లు తెలిసింది.

సీఎం చంద్రబాబు సంతాపం

అమరావతి, జనవరి19(ఆంధ్రజ్యోతి): కందులవారిపల్లె ఉప సర్పంచ్‌ రాకే్‌షచౌదరి ఏనుగుల దాడిలో మృతి చెందటంపై సీఎం చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పసుపు సైనికుడి మృతి బాధాకరమని, పోరాటపటిమతో అనతి కాలంలోనే గుర్తింపు పొందిన రాకేష్‌ మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. రాకేష్‌ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.

Updated Date - Jan 20 , 2025 | 01:33 AM