Share News

గరుడుడిపై కల్యాణ వెంకన్న

ABN , Publish Date - Feb 23 , 2025 | 02:07 AM

శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీనివాసమంగాపురం జనసంద్రమైంది. ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన సేవలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో మోహినీ అవతారంగా అలంకరించి పల్లకిపై అధిష్ఠించారు. తిరుచ్చి వాహనంపై నవనీత కృష్ణుడు రక్షణగా ఆలయ తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి గరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. అనంతరం ఆలయ తిరుమాడ వీధుల్లో అశ్వ, వృషభ, గజరాజులు ఠీవీగా నడుస్తుండగా చెక్క భజనలు, కోలాటాలు, పిల్లంగట్లు, కేరళ వాయిద్యాల నడుమ భక్తుల గోవిందనామ స్మరణలతో కీర్తిస్తుండగా స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన శ్రీలక్ష్మీకాసుల హారాన్ని టీటీడీ పరిపాలన భవనం నుంచి శోభయాత్రగా శ్రీనివాసమంగాపురం ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారికి అలంకరించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

గరుడుడిపై కల్యాణ వెంకన్న
గరుడుడిపై కల్యాణ వెంకన్న

. జనసంద్రమైన శ్రీనివాసమంగాపురం

చంద్రగిరి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గరుడోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీనివాసమంగాపురం జనసంద్రమైంది. ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన సేవలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో మోహినీ అవతారంగా అలంకరించి పల్లకిపై అధిష్ఠించారు. తిరుచ్చి వాహనంపై నవనీత కృష్ణుడు రక్షణగా ఆలయ తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తిని వాహన మండపానికి తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి గరుడ వాహనంపై అధిష్ఠింపజేశారు. అనంతరం ఆలయ తిరుమాడ వీధుల్లో అశ్వ, వృషభ, గజరాజులు ఠీవీగా నడుస్తుండగా చెక్క భజనలు, కోలాటాలు, పిల్లంగట్లు, కేరళ వాయిద్యాల నడుమ భక్తుల గోవిందనామ స్మరణలతో కీర్తిస్తుండగా స్వామివారు దర్శనమిచ్చారు. శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన శ్రీలక్ష్మీకాసుల హారాన్ని టీటీడీ పరిపాలన భవనం నుంచి శోభయాత్రగా శ్రీనివాసమంగాపురం ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారికి అలంకరించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Updated Date - Feb 23 , 2025 | 02:07 AM