Share News

జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ సురేష్‌ రెడ్డి

ABN , Publish Date - Feb 15 , 2025 | 02:02 AM

జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ కె.సురే్‌షరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈయన హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ సురేష్‌ రెడ్డి

చిత్తూరు లీగల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ న్యాయమూర్తిగా జస్టిస్‌ కె.సురే్‌షరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈయన హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

పోక్సో కోర్టు స్పెషల్‌ పీపీగా మోహనకుమారి

చిత్తూరుకు చెందిన సీనియర్‌ న్యాయవాది వి.మోహన కుమారిని చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న పోక్సో కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమెను పలువురు న్యాయవాదులు అభినందించారు.

8వ కోర్టు ఏపీపీగా జ్యోతిరామ్‌

చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న 8వ అదనపు జిల్లా కోర్టు అడిషినల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ)గా ఎ.జ్యోతిరామ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ఈ కోర్టులో ఏపీపీ పోస్టు ఏడాదికాలంగా ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతిరామ్‌ను పలువురు న్యాయవాదులు అభినందించారు.

Updated Date - Feb 15 , 2025 | 02:02 AM