భూత వాహనంపై జగద్రక్షకుడు
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:00 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు భూతవాహనంపై.. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై ఊరేగారు. మూషికవాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప అనుసరించారు.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు భూతవాహనంపై.. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై ఊరేగారు. మూషికవాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప అనుసరించారు. రాజగోపురం గుండా తేరువీధిలోకి ప్రవేశించి.. ఆ తర్వాత నెహ్రూవీధి, నగరివీధి, బజారువీధిగుండా స్వామి అమ్మవార్ల ఊరేగింపు సాగింది. ఉదయం.. సూర్యప్రభ వాహనంపై పరమ శివుడు, చప్పరంపై అమ్మవారు ఊరేగారు. వీరిని మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై వళ్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప అనుసరించారు. పురవీధుల్లో ఊరేగుతున్న పార్వతి, పరమేశ్వరులను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కోలాటాలు కనువిందుచేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 9గంటలకు: హంస - యాళి వాహనసేవ
రాత్రి 8 గంటలకు: రావణుడు - నెమలి వాహనసేవ