Share News

దారిద్య్రరేఖకు దిగువ వున్న వారిని గుర్తించండి : కలెక్టర్‌

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:08 AM

జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారిని మార్చి 2వ తేదీ నాటికి పీ-4 (పబ్లిక్‌, ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానం ద్వారా గుర్తించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో పీ-4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారిత చేకూర్చడానికి జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో వున్న 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వేపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేర ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు దారిద్య్ర రేఖకు దిగువ వున్న వారిని సర్వే ద్వారా గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేయాలన్నారు. పక్కాగృహం, విద్యుత్‌ సౌకర్యం, ఎల్జీ గ్యాస్‌ కనెక్షన్‌, స్థిర, చర ఆస్తులు లేనివారిని గుర్తించి అర్హులుగా చేర్చాలన్నారు.

దారిద్య్రరేఖకు దిగువ వున్న వారిని  గుర్తించండి : కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారిని మార్చి 2వ తేదీ నాటికి పీ-4 (పబ్లిక్‌, ప్రైవేట్‌ పీపుల్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానం ద్వారా గుర్తించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో పీ-4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారిత చేకూర్చడానికి జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో వున్న 20 శాతం మంది నిరుపేదలను గుర్తించడానికి నిర్వహించనున్న సర్వేపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేర ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు దారిద్య్ర రేఖకు దిగువ వున్న వారిని సర్వే ద్వారా గుర్తించి, వారి వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు చేయాలన్నారు. పక్కాగృహం, విద్యుత్‌ సౌకర్యం, ఎల్జీ గ్యాస్‌ కనెక్షన్‌, స్థిర, చర ఆస్తులు లేనివారిని గుర్తించి అర్హులుగా చేర్చాలన్నారు. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించిన ఇంటింటి సర్వే సమాచారాన్ని అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో సీపీవో సాంబశివారెడ్డి, డీఎల్డీవో రవికుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 02:08 AM