భార్యపై భర్త కత్తితో దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:09 AM
భార్యభర్తల నడుమ ఏర్పడిన స్వల్ప వివాదంతో ఆవేశానికి లోనైన భర్త, భార్యపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. వెంటనే మనస్తాపానికి గురై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. నాయుడుపేట పట్టణంలోని కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న సురేష్, లత దంపతుల మధ్య కుటుంబకలహాలతో వివాదం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి లతపై సురేష్ కత్తితో దాడి చేశాడు. అదే కత్తితో తానూ పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి భార్యభర్తలను నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాయుడుపేట టౌన్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): భార్యభర్తల నడుమ ఏర్పడిన స్వల్ప వివాదంతో ఆవేశానికి లోనైన భర్త, భార్యపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు. వెంటనే మనస్తాపానికి గురై తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. నాయుడుపేట పట్టణంలోని కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న సురేష్, లత దంపతుల మధ్య కుటుంబకలహాలతో వివాదం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి లతపై సురేష్ కత్తితో దాడి చేశాడు. అదే కత్తితో తానూ పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి భార్యభర్తలను నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.