Share News

అభివృద్ధికి అపార అవకాశాలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 01:17 AM

చిత్తూరు జిల్లాను టెంపుల్‌, ఎకో టూరిజం దిశగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నాయి. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం, కార్వేటినగరంలోని కృష్ణాపురం జలాశయం, యాదమరి మండలంలోని నుంజర్ల ప్రాజెక్టు, బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌, పలమనేరులోని గంగన శిరస్సు జలపాతాలను అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతమైతే ఈ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రోడ్లు కూడా లేవు.అలాగే పెనుమూరు మండలంలోని పులిగుండును పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయి. కేంద్ర నిధులతో జిల్లా కేంద్రమైన చిత్తూరులో నగరవనం ఏర్పాటు చేసినా.. అందులో అరకొర సదుపాయాలే ఉన్నాయి.బోయకొండ గంగమ్మ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశాలున్నాయి.గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన రామకుప్పంలోని ననియాల ఎకో టూరిజం ప్రాజెక్టును విస్తరించి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక అభివృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయి. కాణిపాకం ఆలయానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి.

అభివృద్ధికి అపార అవకాశాలు
బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌ జలపాతం

నేడు జాతీయ పర్యాటక దినోత్సవం

బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌ జలపాతం

ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, జలపాతాలతో పాటు ఆహ్లాదకర వాతావరణానికి చిత్తూరు జిల్లా పేరుగాంచింది.

పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలున్నా ఆ దిశగా అడుగుపడడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో

పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా కూడా ఈ దిశగా కనీస ప్రయత్నం చేయలేదు. కూటమి ప్రభుత్వమైనా జిల్లాను

పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని అందరూ కోరుకుంటున్నారు.

చిత్తూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి):చిత్తూరు జిల్లాను టెంపుల్‌, ఎకో టూరిజం దిశగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నాయి. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం, కార్వేటినగరంలోని కృష్ణాపురం జలాశయం, యాదమరి మండలంలోని నుంజర్ల ప్రాజెక్టు, బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్‌, పలమనేరులోని గంగన శిరస్సు జలపాతాలను అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతమైతే ఈ ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రోడ్లు కూడా లేవు.అలాగే పెనుమూరు మండలంలోని పులిగుండును పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయి. కేంద్ర నిధులతో జిల్లా కేంద్రమైన చిత్తూరులో నగరవనం ఏర్పాటు చేసినా.. అందులో అరకొర సదుపాయాలే ఉన్నాయి.బోయకొండ గంగమ్మ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా అవకాశాలున్నాయి.గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన రామకుప్పంలోని ననియాల ఎకో టూరిజం ప్రాజెక్టును విస్తరించి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక అభివృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయి. కాణిపాకం ఆలయానికి రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా టెంపుల్‌ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి.పుత్తూ రు సమీపం మూలవంక జలపాత పరిసరాలను అభివృద్ధి చేస్తే వారాంతాల్లో జిల్లాతోపాటు పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.

ఎలిఫెంట్‌ టూరిజానికీ..

పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల సమస్యను పరిష్కరించడంతోపాటు పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు అక్కడి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. పలమ నేరు సమీపం ముసలిమడుగు అటవీప్రాంతంలోని 50 ఎకరాల్లో కుంకీ ఏనుగుల విడిదికి ఏర్పాట్లు చేస్తున్నారు.కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకొచ్చి మదపుటేనుగుల్ని కంట్రోల్‌ చేయడంతోపాటు ఎలిఫెంట్‌ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారు.

పర్యాటక మంత్రిగా రోజా ఫెయిల్‌

వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా రెండేళ్లకుపైగా పనిచేసిన రోజా సొంత నియోజకవర్గానికి కూడా కనీ సం ఒక్క మేలు చేయలేదు.పర్యాటక రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. కాణిపాకానికి సమీపంలో కొత్తపల్లె దగ్గర శిల్పారామం ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించగా.. అధికారులు స్థలాన్ని పరిశీలించారు.ఆ తర్వాత అతీగతీ లేదు.

Updated Date - Jan 25 , 2025 | 01:17 AM