సైకిల్‌పైనే చుట్టేస్తున్నాడు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 02:21 AM
పేదింట్లో పుట్టిన ఆ యువకుడు మూడేళ్ల క్రితం బీకామ్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఉద్యోగం రొటీన్‌గా మారింది. తనకంటూ ఏదైనా ప్రత్యేక గుర్తింపు కావాలని భావించి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సైకిల్‌పై ప్రపంచం చుట్టాలనుకున్నాడు. గతేడాది జూన్‌లో రూ.3 వేలతో లడఖ్‌కు ప్రయాణమయ్యాడు.లడఖ్ వెళ్లొచ్చిన ఉత్సాహంతో పక్క దేశమైన నేపాల్‌కు కూడా సైకిల్‌పైనే వెళ్లొచ్చాడు. గోవా యాత్ర కూడా పూర్తి చేశాడు.తర్వాతఈ ఉత్సాహంతో ఆలిండియా యాత్రకు సిద్ధమవుతున్నాడు. ‘ప్రపంచ ప్రయాణికుడు’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో తన రైడ్ విశేషాలు వివరిస్తున్నాడు.

చిత్తూరు, ఆంధ్రజ్యోతి

పలమనేరు పట్టణం శ్రీనగర్‌కు చెందిన టైలర్ మస్తాన్ బాషా కుమారుడైన బషీర్ డిగ్రీ పూర్తయ్యాక 2024 వరకు బెంగళూరులోని ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌వెంటరీ మేనేజ్‌మెంట్ టీమ్‌లో పనిచేశారు.ఉద్యోగం మానేశాక యాత్రలకోసం రూ.3 వేలతో సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుగోలు చేశాడు. గతేడాది జూన్‌లో లడఖ్‌కు సైకిల్‌పై పయనమయ్యాడు.రోజుకు రూ.వంద చొప్పున 30 రోజులకు ఖర్చులకోసం రూ.3 వేలతో బయల్దేరాడు. రాత్రిళ్లు పెట్రోల్ బంకుల్లో టెంట్ వేసుకుని నిద్రించేవాడు. నాగపూర్‌కు వెళ్లేటప్పటికి రూ.3 వేలు అయిపోయాయి.ఈ విషయం తెలిసి పలమనేరు నుంచి స్నేహితులు డబ్బు పంపించారు. మార్గమధ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు ‘ఉంబ్లింగా పాస్’ గుండా ప్రయాణం చేసిన బషీర్ మొత్తం 3400 కిలోమీటర్లు ప్రయాణించి లడఖ్ చేరుకున్నాడు.దీంతో బషీర్‌కు మంచి గుర్తింపు లభించింది. కలెక్టర్ సుమిత్‌కుమార్ కలెక్టరేట్‌కు పిలిచి అభినందించారు. తర్వాత పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అభినందించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన శివశంకర్‌రెడ్డి సన్మానించారు.వీరే కాక పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రశంసించారు. చిత్తూరు టీడీపీ నాయకుడు వసంత్‌కుమార్ తన కార్యాలయానికి పిలిపించి ఆర్థిక సాయం చేశారు.
ఫ రెండోసారి నేపాల్‌కు..
గతేడాది జూలై 25న నేపాల్‌కు బయల్దేరిన బషీర్‌కు పలమనేరుకు చెందిన ఫయాజ్ రూ.30 వేల విలువ చేసే సైకిల్‌ను బహూకరించారు. 1900 కిలోమీటర్లు ప్రయాణించి నేపాల్ చేరుకున్న బషీర్.. అక్కడ ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగరేశారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 5న పలమనేరు టు గోవా ప్రయాణాన్ని 7 రోజుల్లో పూర్తి చేశారు.
ఫ విజయవాడ వరద బాధితుల కోసం..
తనకు వచ్చిన చిన్నపాటి గుర్తింపుతో బషీర్ ఆపన్నులను ఆదుకునే పని కూడా చేస్తున్నాడు. పలమనేరులోని దుకాణాల వద్దకు వెళ్లి విజయవాడ వరద బాధితుల కోసం
బషీర్ విరాళాలు సేకరించాడు. ఆ డబ్బుతో వంద మందికి బట్టలు, స్నాక్స్, మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్స్
తీసుకెళ్లి పంపిణీ చేశాడు.ఇటీవల పలమనేరు కీలపట్ల ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు
పుస్తకాలను అందించాడు.
రామ్ ద ట్రావెలర్ నాకు ఆదర్శం
గుంటూరుకు చెందిన ‘రామ్ ద ట్రావెలర్’ అనే సైకిల్ రైడర్ నాకు ఆదర్శం. ఆయన సైకిల్‌పైనే 13 దేశాలు తిరిగాడు. ఇప్పుడు సింగపూర్ రైడ్‌లో ఉన్నాడు.ఆయనకు య్యూట్యూబ్‌లో 8 లక్షలు, ఇన్‌స్టాలో 1.44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఆయన్ను
ఆదర్శంగా తీసుకునే నేను సైకిల్ రైడ్ ప్రారంభించా. ఆయన నా రైడ్లకు ఆర్థిక సాయం కూడా చేశారు.నా ఆలిండియా రైడ్ కోసం రూ.1.70 లక్షల సైకిల్ ఇచ్చేందుకు ఈ నెలాఖరున ఆయన పలమనేరుకు రానున్నారు. - బషీర్