Share News

నేడు గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 02:04 AM

జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి కేంద్రంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,801మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వారి సౌకర్యార్థం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, 7032157040ను కేటాయించారు. జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ నేతృత్వంలో పేపర్‌-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగనున్నాయి. మొబైల్‌ఫోన్‌, ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు అనుమతి లేదు. బస్టాండు నుంచి కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు.

నేడు గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్న అధికారులు

  • హాజరుకానున్న 5,801 మంది అభ్యర్థులు

  • కంట్రోల్‌ రూమ్‌ నెంబరు 7032157040

తిరుపతి(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి కేంద్రంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,801మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వారి సౌకర్యార్థం తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, 7032157040ను కేటాయించారు. జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ నేతృత్వంలో పేపర్‌-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగనున్నాయి. మొబైల్‌ఫోన్‌, ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు అనుమతి లేదు. బస్టాండు నుంచి కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు.

Updated Date - Feb 23 , 2025 | 02:04 AM