గవర్నర్ ప్రసంగం ప్రజలకు భరోసా
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:55 AM
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు.

అసెంబ్లీ వాయిస్:
తిరుపతి ఎమ్మెల్యే
తిరుపతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించిందన్నారు. 93 కేంద్ర పథకాలను గత ప్రభుత్వం నిలిపివేయగా 74 పథకాలను ఎనిమిది నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ధరించారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టిన పథకాల గురించి వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తూ.. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్న భరోసాను గవర్నర్ ప్రసంగం ఇచ్చిందన్నారు.