టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:51 AM
టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షలు జరిగే రోజుల్లో హాల్‌టికెట్ చూపి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు
వెదురుకుప్పం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ విధమైన బస్సు పాసులు లేకపోయినా హాల్ టికెట్ చూపితే పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి బస్సుల్లో అనుమతిస్తారు.